📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Telugu News: Akhanda 2: అఖండ 2 ప్రీమియర్ షో రద్దు

Author Icon By Tejaswini Y
Updated: November 26, 2025 • 12:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ 2: తండవం’(Akhanda 2) ఈ సంవత్సరం డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ట్రైలర్ రిలీజ్(Trailer release) చేసిన తర్వాత సినిమా మీద అంచనాలు మరింత పెరిగి, ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ నెలకొంది. బోయపాటి స్టైల్ మాస్ ట్రీట్‌మెంట్, బాలయ్య పవర్‌ఫుల్ లుక్ ఈ సీక్వెల్‌పై మరింత హైప్ క్రియేట్ చేశాయి.

Read also :  Oscar: ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ మహావతార్ నరసింహ’ చిత్రం

యూఎస్‌ఏలో 3D అభిమానులకు నిరాశ

‘అఖండ 2’ను ఈసారి 3D ఫార్మాట్‌లో కూడా తయారు చేసినట్లు టీమ్ ప్రకటించినా, అమెరికాలో మాత్రం ప్రీమియర్ షోల కోసం ఈ వెర్షన్ అందుబాటులో ఉండదని డిస్ట్రిబ్యూటర్ తెలిపాడు. యూఎస్‌ఏలో ప్రీమియర్‌లు కేవలం 2D వెర్షన్‌లోనే జరుగుతాయి. 3D వెర్షన్ మాత్రం ప్రీమియర్ తర్వాత రోజు నుంచి మాత్రమే థియేటర్లలో కనిపించనుంది. దీతో అక్కడి బాలయ్య అభిమానులు తమ ప్రణాళికలను మార్చుకోవాల్సి వస్తోంది.

Akhanda 2 premiere show cancelled

చిక్కబళ్లాపురలో గ్రాండ్ ట్రైలర్ లాంచ్

ఇటీవల కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో అఖండ 2(Akhanda 2) ట్రైలర్‌ను ఘనంగా విడుదల చేశారు. భారీగా అభిమానులు హాజరై ఈ ఈవెంట్‌ను విజయవంతం చేశారు. ఆ తర్వాత ట్రైలర్ సోషల్ మీడియాలో విడుదల కావడంతో కొన్ని సెకన్లలోనే వైరల్ అయ్యింది.

ట్రైలర్‌లో బాలయ్య చెప్పిన డైలాగ్ “ఇప్పటి వరకూ మా దేశ రూపాన్ని చూసావ్… మా దేశ విశ్వరూపాన్ని చూడలేదు” సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సనాతన ధర్మం నేపథ్యంలో సాగుతున్న కథలో ఈసారి కూడా బోయపాటి అదే థీమ్‌ను బలంగా ప్రతిబింబిస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య అఖండ గెటప్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, హై ఆక్షన్ సీన్స్, గ్రాండ్ విజువల్స్ ఈ చిత్రానికి భారీ రేంజ్ వాతావరణం తీసుకొస్తున్నాయి. తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ట్రైలర్‌కు అదనపు బలం చేకూర్చింది.

సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి

మొదటి భాగం ‘అఖండ’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన నేపథ్యంలో, అదే కాంబినేషన్ మళ్లీ రావడం అఖండ 2పై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ట్రైలర్ విడుదలతో ఆ హైప్ మరింత రెట్టింపు అయింది. యూఎస్‌ఏలో 3D విడుదల ఆలస్యం కొంత నిరాశ కలిగించినప్పటికీ, బాలయ్య–బోయపాటి మాస్ కాంబో మరోసారి బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Akhanda 2 Akhanda 2 3D Akhanda 2 Release Date Akhanda 2 trailer Akhanda 2 USA Shows Balakrishna Boyapati Sreenu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.