బాలకృష్ణ (Balakrishna) నటించిన “అఖండ 2 – తాండవం” (Akhanda 2) ఈరోజు(డిసెంబర్ 5న) థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ అనుకోని సమస్యల కారణంగా విడుదల నిలిపివేయడంతో అభిమానులు నిరాశ చెందారు. సినిమా విడుదల వాయిదాపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్న వేళ, ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు (Suresh Babu) దీనిపై స్పందించి అసలు కారణాన్ని వెల్లడించారు.
Read Also: Prabhas: కొత్త లుక్ లోప్రభాస్
రూమర్లను నమ్మొద్దండి
‘సైక్ సిద్ధార్థ’ సినిమా ప్రెస్ మీట్‌లో మాట్లాడిన సురేష్ బాబు, అఖండ 2 (Akhanda 2) విడుదల వాయిదా పూర్తిగా ఆర్థిక సమస్యల కారణంగానే వాయిదా పడిందని చెప్పారు.”డబ్బుల విషయాలు బయట చర్చించాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులకు సినిమా చూడటమే ముఖ్యం తప్ప,
ఈ వివరాలు ఎందుకు?” అని ఆయన అభిప్రాయపడ్డారు. మూవీపై వచ్చే ఎటువంటి రూమర్లను నమ్మవద్దని ఆయన సూచించారు. ఇలాంటి ఫైనాన్స్ సమస్యలు ఇండస్ట్రీకి కొత్తేమీ కాదని, సరైన ప్రణాళికతో వీటిని అధిగమించవచ్చని సురేశ్ బాబు తెలిపారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: