Ajith Kumar box office 2025 : కోలీవుడ్‌లో భారీ స్టార్ పవర్ ఉన్న Ajith Kumar (థల అజిత్)కు 2025 కీలక సంవత్సరం అయ్యింది. పోస్ట్-కోవిడ్ కాలంలో నిరాశపరిచిన ట్రాక్ రికార్డ్‌ను మార్చుకునే అవకాశంతో ఆయన రెండు భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఫైనల్ ఫలితం మాత్రం ఆశించినంత బలంగా లేకపోయింది.
ఒక సంవత్సరం గ్యాప్ తర్వాత వచ్చిన తొలి చిత్రం Vidaamuyarchi పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ మిక్స్‌డ్ రివ్యూస్, సగటు వర్డ్ ఆఫ్ మౌత్ కారణంగా సినిమా బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోలేకపోయింది. దాదాపు ₹185 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, భారత బాక్సాఫీస్‌లో కేవలం ₹80.58 కోట్ల నెట్ మాత్రమే వసూలు చేసి, 100 కోట్ల మార్క్‌కే చేరలేదు. ఫలితంగా ఈ సినిమాకు ఫ్లాప్ తీర్పు దక్కింది.
Read Also: Bigg Boss 9: గ్రాండ్ ఫినాలే ప్రోమో విడుదల
తర్వాత వచ్చిన Good Bad Ugly మాత్రం మాస్ (Ajith Kumar box office 2025) ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. క్రిటిక్స్ నుంచి మిక్స్‌డ్ స్పందన వచ్చినప్పటికీ, థల అజిత్ మాస్ క్యారెక్టర్ కారణంగా కలెక్షన్లు మెరుగ్గా వచ్చాయి. అయితే ₹200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా, భారత్‌లో ₹153.77 కోట్ల నెట్ మాత్రమే వసూలు చేయగలిగింది. బడ్జెట్‌తో పోలిస్తే ₹46.23 కోట్ల లోటు రావడంతో, ఈ చిత్రానికీ నష్టపు తీర్పే మిగిలింది.
ఈ రెండు చిత్రాల కలిపి కలెక్షన్‌ను చూస్తే, 2025లో అజిత్ కుమార్ సినిమాలు మొత్తం ₹234.35 కోట్ల నెట్ వసూలు చేశాయి. కానీ ఒక్క సినిమా కూడా బ్రేక్-ఈవెన్‌ను దాటకపోవడంతో, ఈ ఏడాది ఆయన సక్సెస్ రేషియో 0%గా నమోదైంది. మొత్తం ₹385 కోట్ల పెట్టుబడికి కేవలం 60.87% మాత్రమే రికవరీ కావడం గమనార్హం. మొత్తంగా ₹150.65 కోట్ల లోటుతో 2025 అజిత్‌కు నిరాశకర సంవత్సరంగా మిగిలింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: