📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: Ajith Kumar – నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ నుంచి అజిత్ కుమార్ సినిమా డిలీట్..కారణమిదే?

Author Icon By Anusha
Updated: September 17, 2025 • 12:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత సినిమా రంగంలో ఇళయరాజా (Ilayaraja) పేరు ప్రత్యేక స్థానాన్ని పొందిన సంగీత దర్శకుడిగా గుర్తించబడింది. గత ఐదున్నర దశాబ్దాలుగా ఆయన సృష్టించిన సంగీతం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరించడమే కాక, సినిమా సంగీతానికి కొత్త ధోరణిని కూడా సృష్టించింది. చిన్న చిన్న మెలోడీలు, సమగ్ర సంగీత నిర్మాణం, పాటలలోని అనుభూతి భావం అన్ని కలిపి ఇళయరాజా సంగీతాన్ని లెజెండరీగా నిలిపాయి.

అయితే, ఇళయరాజా తన సంగీత కాపీరైట్‌ల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తారు. ఆయన అనుమతి లేకుండా తన సంగీతాన్ని వాడితే, వెంటనే కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు. చిన్న ట్యూన్, బ్యాక్‌గ్రౌండ్ మెలోడి కూడా అనుమతించరు. ఈ విధంగా, కొన్ని సందర్భాల్లో ఆయన స్నేహితులు అయినా, ఫిల్మ్ వర్గాల్లో పని చేసిన వారిపై కూడా పిటిషన్ వేసిన సందర్భాలు ఉన్నాయి. కాపీరైట్‌ రక్షణ విషయంలో ఆయన ఎల్లప్పుడూ తీవ్రంగా ఉంటారని సినీ పరిశ్రమలో తెలిసిన విషయం.

Ajith Kumar

ఇలాంటి పరిస్థిలో ఇటీవల కలకాలం చర్చనీయాంశమైన వ్యవహారం ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ సినిమా చుట్టూ జరిగింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా, అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందింది. అలాగే, తమిళ, తెలుగు ప్రొడ్యూసర్లు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ తమ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ (Mythri Movie Makers banner) పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. సమ్మర్ కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి స్పందన పొందింది.

అయితే అనుమతి లేకుండా తన పాటలను సినిమాలో ఉపయోగించారని ఆరోపిస్తూ ఇళయరాజా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇది కాపీరైట్‌ చట్టానికి విరుద్ధమని, వెంటనే ఆ సాంగ్స్ తొలగించాలని, పాటలు ఉపయోగించినందుకు తగిన నష్ట పరిహారం చెల్లించాలని కోరారు.ఇళయరాజా పిటిషన్ పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు (Madras High Court).. ఆయన పాటలను ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ సినిమాలో ప్రదర్శించొద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ వివాదంపై చిత్ర నిర్మాత

దీంతో అజిత్‌ కుమార్‌ సినిమాని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ నుంచి తొలగించారు. అయితే ఇండియాలో స్ట్రీమింగ్ నిలిపివేసినప్పటికీ, అమెరికాతో సహా పలు దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ (‘Good Bad Ugly’) వివాదంపై చిత్ర నిర్మాత మైత్రీ రవి ఇటీవల స్పందించారు. తాము విడుదలకు ముందే అన్ని పర్మిషన్లు తీసుకున్నామని, నిబంధనలకు అనుగుణంగా సాంగ్స్ ఉపయోగించామమని తెలిపారు. కానీ ఇప్పుడు కోర్ట్ ఆర్డర్ తో నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాని తొలగించడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మేకర్స్ ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలి.

అజిత్ కుమార్ తుది సినిమా ఏమిటి?

తాజాగా ఆయన గుడ్ బాడ్ అగ్లీ సినిమాలో నటించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/pawan-kalyan-og-trailer-update-release-date/movies/548749/

Breaking News copyright issues five and a half decades global fans Ilaiyaraaja latest news Legal action legendary Indian music director music maestro strict about song usage Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.