📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Aishwarya Lekshmi – సోష‌ల్ మీడియాకు గుడ్ బాయ్ చెప్పేసిన ఐశ్వ‌ర్య

Author Icon By Anusha
Updated: September 13, 2025 • 7:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల కాలంలో సినీ తారలు సోషల్ మీడియా (Social media) కు కొంత దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హంగా మారింది. అభిమానులతో అనుసంధానం, సినిమాల ప్రమోషన్లు, వ్యక్తిగత విషయాల షేరింగ్ ఇలా సోషల్ మీడియా వినియోగం నటీనటులకు దాదాపు తప్పనిసరి అయిపోయింది. అయితే ఈ వేదికలపై ఎక్కువ సమయం గడపడం వల్ల వ్యక్తిగత జీవితంలో సమతుల్యత కోల్పోతున్నారనే భావన పలువురికి కలుగుతోంది.

ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty) తాను కొంత కాలం సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటానని ప్రకటించింది. ఆమె ప్రకటన తర్వాత చాలా మంది అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనుష్క సోషల్ మీడియాలో అంత యాక్టివ్ కాకపోయినా, అప్పుడప్పుడు ఫ్యాన్స్‌తో కనెక్ట్ అవుతూ ఉండేది. ఇప్పుడు ఆమె తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కారణాలు ఏమిటన్నది అభిమానుల్లో చర్చనీయాంశమైంది.

న‌టి ఐశ్వర్య లక్ష్మి సోష‌ల్ మీడియాకు గుడ్ బాయ్

అయితే అనుష్క ప్ర‌క‌టించిన కొద్ది గంట‌ల్లోనే తాజాగా మ‌రో న‌టి సోష‌ల్ మీడియా నుంచి దూరం అవుతున్న‌ట్లు తెలిపింది. త‌మిళ న‌టి ఐశ్వర్య లక్ష్మి (Tamil actress Aishwarya Lakshmi) తాజాగా సోష‌ల్ మీడియాకు పూర్తిగా దూరమవుతున్నట్లు ప్ర‌క‌టించింది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే సోషల్ మీడియా తప్పనిసరి తాను మొద‌ట్లో అనుకున్నాన‌ని.. కానీ కాలంతో పాటు మ‌న‌ము కూడా అప్‌డేట్ అవ్వాలన్న ఆలోచన తనను ఎంతగానో ప్రభావితం చేసిందని ఐశ్వ‌ర్య తెలిపింది.

Aishwarya Lekshmi

అంతేకాకుండా ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయని.. తాను సోషల్ మీడియాకు బానిసగా మారిపోయానని అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు న‌టి తెలిపింది. ఈ సంద‌ర్భంగా ఇన్‌స్టా (Instagram) వేదిక‌గా ఒక పోస్ట్ పెట్టింది.నేను నా పని, పరిశోధనలపై దృష్టి పెట్టకుండా, సోషల్ మీడియా నా ఆలోచనలను దారి మళ్లించింది. సోష‌ల్ మీడియా వ‌ల‌న‌ నాలోని క్రియేటివిటీ పోయింది. నాలో నెగిటివిటీని పెంచ‌డ‌మే కాకుండా ఒక స‌ర్కిల్‌లో లాక్ అయ్యేలా చేసింది. నాకు నేను ఏదో ఒక సూపర్ నెట్‌గా మారిపోవడం నాకు ఇష్టం లేదు.

నాలో ఉన్న చిన్న పాపని కాపాడుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నా

ఒక మహిళగా, నేను చాలా కష్టపడి నన్ను నేను మెరుగుపరుచుకున్నాను, కానీ సోష‌ల్ మీడియాకి లొంగిపోవడానికి నేను ఇష్టపడలేదు.ప్రపంచం నన్ను మర్చిపోతుందనే రిస్క్‌కు నేను సిద్ధంగా ఉన్నాను. నాలోని కళాకారిణిని, నాలో ఉన్న చిన్న పాపని కాపాడుకోవడానికి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఇంటర్నెట్ (Internet) నుండి పూర్తిగా అదృశ్యమవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. భవిష్యత్తులో మరింత అర్థవంతమైన బంధాలను, మంచి సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను. నేను నిజంగా మంచి సినిమా చేస్తే, మీరు పాత తరహాలోనే ప్రేమను పంచుతారని ఆశిస్తున్నానంటూ ఐశ్వ‌ర్య రాసుకోచ్చింది.

Read hindi news: epaper.vaartha.com

Read Also:

https://vaartha.com/do-you-wanna-partner-series-do-you-wanna-partner-amazon-prime-series-review/cinema/546706/

Aishwarya Lakshmi quits social media Anushka Shetty social media break Breaking News Celebrity social media detox latest news Tamil actress updates Telugu News Tollywood Actress News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.