Aishwarya Arjun: సీతా పయనం ట్రైలర్‌ రిలీజ్

Read Time:  1 min
Aishwarya Arjun: సీతా పయనం ట్రైలర్‌ రిలీజ్
FONT SIZE
GET APP
Aishwarya Arjun: Sita Payanam trailer release
Aishwarya Arjun: Sita Payanam trailer release

యాక్షన్‌ కింగ్‌ అర్జున్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘సీతా పయనం’పై సినీ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. హీరోగా ఎన్నో యాక్షన్‌ సినిమాలతో పేరు తెచ్చుకున్న అర్జున్, ఈసారి దర్శకుడిగా ప్రేమకథను తెరపైకి తీసుకొస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వాలైంటెన్స్ డే కానుకగా ఈ నెల 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.

Read Also: Vishwak Sen: ‘ఫంకీ’ ట్రైలర్ ఎలా ఉందంటే?

కీలక పాత్రలు

ఈ సినిమాలో ఐశ్వర్య అర్జున్ (Aishwarya Arjun) సరసన నిరంజన్ కథానాయకుడిగా నటిస్తుండగా.. సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించారు. యాక్షన్ కింగ్ అర్జున్ స్వయంగా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. అర్జున్ మేనల్లుడు, యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా కూడా ఒక పవర్ ఫుల్ కామియో రోల్‌లో మెరవనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.