బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద, ఆయన భార్య సునీతా అహుజా విడిపోనున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 37 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకనున్నారని, వీరు చాలా కాలంగా విడివిడిగా నివసిస్తున్నారని ‘జూమ్ టీవీ’ ఒక కథనంలో పేర్కొంది. ఈ వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.గోవింద, సునీతా మధ్య విభేదాలు పెరిగాయని, వీరి విభిన్న జీవనశైలి వారిని మరింత దూరం చేసిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘బాలీవుడ్ నౌ’ కథనం ప్రకారం, గోవింద ప్రస్తుతానికి ఓ మరాఠీ నటితో రిలేషన్‌లో ఉన్నట్లు, ఈ కారణంగానే ఈ జంట విడాకుల వైపు మొగ్గుచూపుతోందని వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై గోవింద గానీ, సునీతా గానీ అధికారికంగా స్పందించలేదు.సునీతా అహుజా ఇటీవల ‘హిందీ రష్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారి పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు వెల్లడించారు.తాము రెండు ఇళ్లలో వేర్వేరుగా ఉంటున్నామని ఆమె వెల్లడించారు. గోవింద తరచుగా తన బంగ్లాలో ఉంటారని, ఎందుకంటే అతను అనేక మీటింగ్‌లు నిర్వహిస్తాడని, ఫలితంగా ఆలస్యంగా ఇంటికి వస్తాడని అన్నారు. అందుకే తాను ఇద్దరు పిల్లలతో కలిసి వేరే ఫ్లాట్‌లో నివసిస్తున్నట్లు తెలిపారు.

వివాహం
గోవింద, సునీతా 1987 మార్చిలో వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమ కథ 80వ దశకంలో బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. గోవింద కెరీర్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఈ జంట పెళ్లి చేసుకుంది. 1988లో కుమార్తె టీనా జన్మించగా, 1997లో కుమారుడు యశ్వర్ధన్ జన్మించాడు. ప్రస్తుతం యశ్వర్ధన్ బాలీవుడ్‌లో తన కెరీర్‌ను స్థిరపరుచుకునే ప్రయత్నంలో ఉన్నాడు.గోవింద, సునీతా 1987 మార్చిలో వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమ కథ 80వ దశకంలో బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. గోవింద కెరీర్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఈ జంట పెళ్లి చేసుకుంది. 1988లో కుమార్తె టీనా జన్మించగా, 1997లో కుమారుడు యశ్వర్ధన్ జన్మించాడు. ప్రస్తుతం యశ్వర్ధన్ బాలీవుడ్‌లో తన కెరీర్‌ను స్థిరపరుచుకునే ప్రయత్నంలో ఉన్నాడు.
వీరి విడాకుల వార్తలపై గోవింద అభిమానులు షాక్ అయ్యారు. బాలీవుడ్‌లో ప్రేమకథలుగా మారిన చాలా పెళ్లిళ్లు చివరకు విడాకులతో ముగుస్తుండటం బాధాకరంగా ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే, ఈ వార్తలపై గోవింద లేదా సునీతా అహుజా ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
బాలీవుడ్‌లో ఇలాంటి విడాకుల వార్తలు వస్తూనే ఉంటాయి. కానీ, గోవింద-సునీతా విడిపోతారా? లేక కేవలం పుకార్లేనా? అనేది త్వరలోనే తెలిసిరానుంది.
గోవింద 90వ దశకంలో బాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన హీరోగా నిలిచారు. ఆయన నటించిన “కూలీ నం. 1”, “హీరో నం. 1”, “దుల్హే రాజా” లాంటి సినిమాలు ఆయనను టాప్ హీరోగా నిలిపాయి. అయితే కాలక్రమేణా గోవింద సినీ పరిశ్రమలో తన స్థానాన్ని కోల్పోయారు.