हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Urvashi Rautela : ఊర్వశీ రౌతేలాపై పూజారుల ఆగ్రహం

Divya Vani M
Urvashi Rautela : ఊర్వశీ రౌతేలాపై పూజారుల ఆగ్రహం

బాలీవుడ్ గ్లామర్ క్వీన్ ఊర్వశి రౌతేలా ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు అయితే ఈసారి సినిమా కాదు, ఆమె చేసిన ఓ వ్యాఖ్యే ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది. ఉత్తర భారతదేశంలో తన పేరుతో ఆలయం ఉందని, దక్షిణాదిలో కూడా అభిమానులు తన పేరుతో గుడి కట్టాలనుకుంటున్నారని చెప్పిన మాటలు చర్చనీయాంశంగా మారాయి.ఊర్వశి ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పింది ‘‘ఉత్తరాదిలో నాకు గుడి ఉంది. ఇప్పుడు దక్షిణాదిలో కూడా అద్దిరిపోయే స్థాయిలో ఆలయం కావాలని అభిమానులు కోరుతున్నారు’’ అని ఆమె వ్యాఖ్యానించింది. అయితే, ఈ మాటలు ఆలయ పూజారులను కంగారుపెడుతున్నాయి ఈ వ్యాఖ్యలపై పూజారి భువన్ చంద్ర ఉనియాల్ ఘాటుగా స్పందించారు.

Urvashi Rautela ఊర్వశీ రౌతేలాపై పూజారుల ఆగ్రహం
Urvashi Rautela ఊర్వశీ రౌతేలాపై పూజారుల ఆగ్రహం

బద్రీనాథ్ సమీపంలో బామ్ని అనే గ్రామంలో ఊర్వశి దేవికి ఆలయం ఉందని పేర్కొన్నారు.కానీ ఆ ఆలయానికి నటి ఊర్వశితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు పౌరాణిక దేవతకు సంబంధించి ఉన్న గుడిని వ్యక్తిగత ప్రమోషన్‌కి వాడటం అసహ్యకరమని అభిప్రాయపడ్డారు.అంతేకాదు, బ్రహ్మకపాల్ తీర్థ పురోహిత్ సొసైటీ అధ్యక్షుడు అమిత్ సతీ కూడా ఊర్వశి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘‘ఈ ఆలయం వేలాది సంవత్సరాల చరిత్ర కలిగినదే. ఇది ఊర్వశి దేవికి చెందింది, నటి ఊర్వశికి కాదు. ఆమె చేసిన వ్యాఖ్యలు మత విశ్వాసాలను అవమానించేలా ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.బద్రీనాథ్ ప్రాంత ప్రజలు కూడా ఇదే భావన వ్యక్తం చేస్తున్నారు ఊర్వశి చేసిన వ్యాఖ్యలు వారి మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని చెబుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించాలన్న డిమాండ్ చేస్తున్నారు ఆమె మాటలు యువతను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని పలువురు హిందూ మత పెద్దలు పేర్కొంటున్నారు.ఊర్వశి రౌతేలా గ్లామర్ ప్రపంచంలో ఎంత పాపులర్‌ అయి ఉండొచ్చు. కానీ మతానికి సంబంధించిన విషయాల్లో వ్యాఖ్యానించేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ప్రజల నమ్మకాలను గౌరవించడమే మంచిదని ఈ ఘటన మళ్ళీ గుర్తుచేస్తోంది.

Read Also : Pooja Hegde : లైట్ కలర్ శారీలో పూజా హెగ్డే సోయగాలు…

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870