Trisha: తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు సినీ నటి త్రిష పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ విజయ్ స్థాపించిన ‘తమిళ వెట్రి కళగం’ (TVK) పార్టీ, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)తో పొత్తు పెట్టుకునే విషయంలో త్రిష కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పొత్తులకు సంబంధించిన తుది నిర్ణయం ఆమె చేతుల్లోనే ఉందనే వార్తలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఇటీవల ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారనే వార్తలు ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి.
Read Also:Ustaad Bhagat Singh Event Case: ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ ఆర్గనైజర్ పై కేసు
తమిళ రాజకీయాల్లో కొత్త కూటమి దిశగా అడుగులు
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో త్రిష రాజకీయ రంగ ప్రవేశం లేదా ఆమె వ్యూహకర్తగా మారడం తమిళ రాజకీయాల్లో పెను సంచలనాలకు దారితీసేలా కనిపిస్తోంది. కేవలం విజయ్ పార్టీయే కాకుండా, ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకే (AIADMK) నేతలు కూడా ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ పరిణామాలు గమనిస్తుంటే, రాబోయే ఎన్నికల్లో అధికార డీఎంకే (DMK)ను ఢీకొట్టేందుకు ఒక బలమైన కూటమి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.
ఒకవేళ టీవీకే, బీజేపీ మరియు ఏఐఏడీఎంకే పార్టీలు కలిసి పోటీ చేస్తే తమిళనాడులో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. సినీ గ్లామర్‌తో పాటు రాజకీయ వ్యూహాలు తోడైతే డీఎంకేకు గట్టి పోటీ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. త్రిష రాజకీయాల్లోకి నేరుగా వస్తారా లేక తెర వెనుక ఉండి చక్రం తిప్పుతారా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: