हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Samantha: ఫోన్ లేకుండా ఉండలేకపోయా..అది ఒక టాక్సిక్ రిలేషన్ షిప్ లా ఫీలయ్యా

Anusha
Samantha: ఫోన్ లేకుండా ఉండలేకపోయా..అది ఒక టాక్సిక్ రిలేషన్ షిప్ లా ఫీలయ్యా

తెలుగు చిత్రసీమలో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సమంత ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఎంతో యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. సినిమాలకు సంబంధించిన అప్డేట్స్‌నే కాకుండా, ఆరోగ్య సంబంధిత విషయాలు, మానసిక స్థితిగతులు, వ్యక్తిగత అనుభవాలు కూడా అభిమానులతో పంచుకుంటూ హెల్తీ డిజిటల్ స్పేస్‌ను నిర్మించేందుకు కృషి చేస్తున్నారు.

అంశాలపై

తాజాగా సమంత తీసుకున్న ఆరోగ్య చైతన్య యాత్రలో “Take 20 Health” పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆమె ఆరోగ్య నిపుణులతో చర్చలు జరిపి, ఫిట్‌నెస్, డైెట్, మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఇంటర్వ్యూల ద్వారా ఆమె ఎన్నో ప్రాముఖ్యత కలిగిన విషయాలను పంచుకుంటున్నారు.

బయోహ్యాకింగ్ చిట్ చాట్ లో

Samantha: ఫోన్ లేకుండా ఉండలేకపోయా..అది ఒక టాక్సిక్ రిలేషన్ షిప్ లా ఫీలయ్యా

కొన్నివారాల క్రితం ఆమె “బయోహ్యాకింగ్” అనే అంశంపై ఓ నిపుణుడితో చిట్ చాట్ నిర్వహించారు. ఆ సందర్భంగా సమంత తన మొబైల్‌ అడిక్షన్ (Mobile addiction) అనుభవాన్ని ఎంతో నిజాయతీగా పంచుకున్నారు. ఆమె తెలిపిన ప్రకారం, తాను ఒక సమయంలో మొబైల్ కు ఎంతగా అడిక్ట్ అయ్యారో చెప్పుకొచ్చారు. ఫోన్ లేకుండా తాను ఉండలేకపోయానని.. అది ఒక టాక్సిక్ రిలేషన్ షిప్ లా ఫీలయ్యానని అన్నారు.

సమంత మాట్లాడుతూ

ఆ అలవాటును తాను ఏ విధంగా అధిగమించారో చెప్పుకొచ్చారు. సమంత మాట్లాడుతూ, వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో మార్పులు చేసుకున్నాను. నాకంటూ ఒక ప్రత్యేకమైన రొటీన్ ఏర్పాటు చేసుకుని దానిని ఫాలో అవుతున్నాను. అందుకు ఇప్పుడు నేను సంతోషంగానే ఉన్నాను.

ఫోన్ వాడకానికి బాగా అలవాటు

అంతకంటే ఆసక్తికరమైనది ఏమంటే,కానీ ఫోన్ విషయంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఫోన్ వాడకానికి బాగా అలవాటు పడ్డాను. ఆ అలవాటు నుంచి బయటపడేందుకు డిజిటల్ డిటాక్స్ (Digital detox) ఫాలో అయ్యాను. ఎవరితోనూ మాట్లాడకుండా, ఫోన్ చూడకుండా, ఇతరులను కలవకుండా ఇలా సుమారు మూడు రోజులు ఉండాలని నిర్ణయించుకున్నాను.

ఆరోగ్య సమస్యలతో

అలా కొన్నిరోజులపాటు పాటించిన తర్వాత ఎంతో మారాను అంటూ చెప్పుకొచ్చారు సమంత. ఇన్నాళ్లు ఆరోగ్య సమస్యలతో (health problems) సినిమాలకు దూరంగా ఉన్న సామ్, ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం నటిగానే కాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు.

సమంత రూత్ ప్రభు ప్రొడక్షన్ పేరు ఏమిటి?

సమంతా రూత్ ప్రభు తొలి నిర్మాణం, శుభమ్, ఆమె కొత్తగా ప్రారంభించిన బ్యానర్ త్రలాలా మూవింగ్ పిక్చర్స్.

సమంత రూత్ ప్రభు డబ్బింగ్ ఎవరు?

రభస, అత్తారింటికి దారేది, రామయ్య వస్తావయ్యా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, 24, ఓహ్ వంటి పలు చిత్రాలలో సమంత రూత్ ప్రభుకు చిన్మయి డబ్బింగ్ చెప్పింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Bad Girl: ఎట్ట‌కేల‌కు ‘బ్యాడ్ గ‌ర్ల్’ సినిమాకు సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్న‌ల్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870