हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Vaartha live news : Manchu Lakshmi : ఆ ఇంటితో నాకు సంబంధం లేదు : మంచు ల‌క్ష్మి

Divya Vani M
Vaartha live news : Manchu Lakshmi : ఆ ఇంటితో నాకు సంబంధం లేదు : మంచు ల‌క్ష్మి

మెడికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘దక్ష’ సినిమా (‘Daksha’ movie)లో మంచు లక్ష్మి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను ఆమె స్వయంగా నిర్మించడమే కాకుండా, కథానాయికగా నటించడం ప్రత్యేకం. సెప్టెంబర్ 19న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో లక్ష్మి ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఒక మీడియా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.ఈ సందర్భంగా మంచు లక్ష్మి (Manchu Lakshmi) మాట్లాడుతూ, తాను ప్రస్తుతం ముంబయిలోనే నివసిస్తున్నానని తెలిపారు. అక్కడినుంచే నా అన్ని పనులు చూసుకుంటున్నాను. ముంబయి లైఫ్‌స్టైల్ నాకు బాగా నచ్చింది. ఉదయం లేచి పనుల్లో తలమునకలవడం నాకు ఇష్టం అని చెప్పారు. ముంబయికి వెళ్ళే ఆలోచనకు ప్రేరణ రానా దగ్గుబాటే అని ఆమె వెల్లడించారు.

Vaartha live news : Manchu Lakshmi : ఆ ఇంటితో నాకు సంబంధం లేదు : మంచు ల‌క్ష్మి
Vaartha live news : Manchu Lakshmi : ఆ ఇంటితో నాకు సంబంధం లేదు : మంచు ల‌క్ష్మి

రానా, చరణ్, సూర్య – ముంబయి కనెక్షన్

ముంబయిలో ఇప్పటికే రానా దగ్గుబాటి, రామ్ చరణ్, సూర్య వంటి ప్రముఖులు ఇల్లు కలిగి ఉన్నారని లక్ష్మి గుర్తుచేశారు. “రానాకి అక్కడ ఇల్లు ఉంది. చరణ్‌కీ కూడా సొంత ఇల్లు ఉంది. సూర్య అయితే అందరికంటే ముందే అక్కడికి వచ్చేశారు. ప్రస్తుతం నేను మాత్రం రెంటుకే ఉంటున్నాను” అని తెలిపారు. అలాగే తాప్సీ, రకుల్ ప్రీత్ సింగ్‌లను అప్పుడప్పుడూ కలుస్తున్నానని చెప్పారు.తాను ఎక్కడ ఉన్నా ఇతరులకు ధైర్యం ఇచ్చే వ్యక్తిగా ఉండాలని కోరుకుంటానని లక్ష్మి స్పష్టం చేశారు. “పిరికితనంగా బ్రతకమని నేను ఎప్పుడూ చెప్పను. ఎంత కష్టమైనా ధైర్యంగా ముందుకు సాగాలి” అని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇల్లు అమ్మకంపై స్పష్టత

ఇటీవల వచ్చిన వార్తలపై స్పందించిన మంచు లక్ష్మి, ఆర్థిక ఇబ్బందుల కారణంగా నేను ఇల్లు అమ్మకానికి పెట్టాను అని రాసారు. కానీ నాకు సొంత ఇల్లే లేదు. అప్పుడు ఎక్కడి ఇల్లు అమ్మకానికి పెడతాను? అని ప్రశ్నించారు. ఫిల్మ్‌నగర్‌లో ఉన్న ఇల్లు తన నాన్నగారి సొత్తు అని, గతంలో తాను అక్కడ ఉన్నానని చెప్పారు. “ఆ ఇంటితో నాకు ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదు” అని స్పష్టం చేశారు.ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట నిజమే. కానీ అలాంటి పరిస్థితుల్లోనూ ఎలా నిలబడాలో నేర్చుకున్నాను. పట్టుదలతోనే ముందుకు సాగుతున్నాను అని ఆమె తెలిపారు. తన కెరీర్‌, జీవన విధానంలో ధైర్యం, పట్టుదల ముఖ్యమని లక్ష్మి అభిప్రాయపడ్డారు.‘దక్ష’ సినిమాతో మరోసారి వెండితెరపై తన ప్రతిభను చూపించబోతున్న మంచు లక్ష్మి, వ్యక్తిగత జీవితంపై వచ్చిన పుకార్లకు కూడా క్లారిటీ ఇచ్చారు. కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు వెళ్లాలని ఆమె ఇచ్చిన సందేశం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

Read Also :

https://vaartha.com/businessman-falls-from-third-floor-in-jodhpur/national/549998/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870