हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Jennifer Lopez India : జెన్నిఫర్ లోపెజ్ ఇండియాలో ఎంట్రీ! ఉదయ్‌పూర్ స్టార్ వెడ్డింగ్‌కు గ్లామర్ హంగులు..

Sai Kiran
Jennifer Lopez India : జెన్నిఫర్ లోపెజ్ ఇండియాలో ఎంట్రీ! ఉదయ్‌పూర్ స్టార్ వెడ్డింగ్‌కు గ్లామర్ హంగులు..

Jennifer Lopez India : ఉదయ్‌పూర్‌లో మరో భారీ సెలెబ్రిటీ వివాహ వేడుకకు రంగం సిద్ధమైంది. అమెరికాలో వ్యాపారవేత్త రాజు రామలింగ మంటేన కుమార్తె నేత్రా మంటేన, ఎన్ఆర్ఐ వంశీ గదిరాజుతో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. నవంబర్ 21 నుంచి ప్రారంభమైన ఈ మహా వేడుకలు నవంబర్ 24 వరకు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు భారీ సంఖ్యలో ఉదయ్‌పూర్‌కు చేరుకుంటున్నారు.

శనివారం తెల్లవారుజామున అంతర్జాతీయ పాప్ స్టార్ మరియు నటి జెన్నిఫర్ లోపెజ్ ఉదయ్‌పూర్ విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే భారీ హంగామా నెలకొంది. బ్రౌన్ అవుట్‌ఫిట్, ఫర్ జాకెట్, గ్లాసెస్‌తో స్టైలిష్‌గా కనిపించిన లోపెజ్ పాపరాజీలకు చేతులు ఊపి, ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ కారులోకి ఎక్కింది. ఆసక్తికరంగా, కొంతమంది ఫోటోగ్రాఫర్లు పొరపాటున “వెల్కమ్ టు ఇండియా రిహానా!” అని పలకడంతో అక్కడ నవ్వుల పూదోట ఏర్పడింది.

Read also: AP CS Extension: సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కాల్: సీఎస్ విజయానంద్ కొనసాగింపు

అదేవిధంగా, అమెరికా అధ్యక్షుడి కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కూడా భారతదేశానికి వచ్చాడు. అతడు ఉదయ్‌పూర్‌కు చేరుకునే ముందే, అతని భద్రత నిమిత్తం యుఎస్ సెక్యూరిటీ టీములు నగరంలో ముందుగానే మోహరించారు. (Jennifer Lopez India) ట్రంప్ జూనియర్ ది లీలా ప్యాలెస్‌లో ఉండనున్నాడు. ఉదయ్‌పూర్‌కు రావడానికి ముందు ఆయన ఆగ్రాలోని తాజ్ మహల్, అలాగే జామ్‌నగర్‌ను సందర్శించాడు.

వివాహ వేడుకల్లో జెన్నిఫర్ లోపెజ్, సౌత్ ఆఫ్రికా డీజే బ్లాక్ కాఫీ ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే ది లీలా ప్యాలెస్ రెడ్-థీమ్ డెకరేషన్‌తో అద్భుతంగా అలంకరించబడింది. భద్రత కూడా భారీగా పెంచబడింది. గురువారం రాత్రి ప్రసిద్ధ డచ్ డీజే డియేస్టో తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో వేడుకలకు శుభారంభం పలికాడు.

ఉదయ్‌పూర్ మొత్తం ప్రస్తుతం ఈ గ్రాండ్ వెడ్డింగ్ వాతావరణంలో కళకళలాడుతోంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870