हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

పెళ్లైన ఆ స్టార్ హీరోను ప్రేమించి కెరీర్ నాశనం

Divya Vani M
పెళ్లైన ఆ స్టార్ హీరోను ప్రేమించి కెరీర్ నాశనం

సినీ రంగం అనేది ఎంతో మంది తమ కలలను నిజం చేసుకునే వేదిక.ఎలాంటి కుటుంబ మద్దతు లేకుండా, పూర్తిగా తమ ప్రతిభపై ఆధారపడి ఈ రంగంలో ప్రవేశించి పేరు తెచ్చుకున్న వారు ఎందరో ఉన్నారు.అయితే, కొన్నిసార్లు చిన్న పొరపాట్లు కూడా భారీ విపత్తులుగా మారి, గొప్ప కెరీర్‌ను నాశనం చేస్తాయి.నటి నిఖిత జీవితం అలాంటి కథనే చెబుతుంది. నిఖిత 2002లో హాయ్ అనే తెలుగు చిత్రంతో సినీరంగంలో అడుగుపెట్టింది.తొలి సినిమాతోనే ఆమె అందం, అభినయం యువతను ఆకర్షించాయి.2003లో వచ్చిన కల్యాణ రాముడు చిత్రంలో వేణు తోట్టంపూడితో కలిసి నటించి భారీ హిట్ సాధించింది. ఈ సినిమా ఆమెకు తెలుగు చిత్రసీమలో మార్గం సుగమం చేసింది.ఆ తర్వాత నిఖిత వరుస అవకాశాలు అందుకుంటూ, తెలుగులో సంబరం , ఖుషీ ఖుషీగా , ఏవండోయ్ శ్రీవారు , మహారాజశ్రీ వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాక, నాగార్జున-అనుష్క జంటగా నటించిన డాన్ చిత్రంలో విలన్ పాత్ర పోషించి మెప్పించింది.

Nikita Thukral
Nikita Thukral

అప్పట్లో ఆమె అందం, అభినయం అభిమానుల హృదయాలను కట్టిపడేసాయి. తన కెరీర్ అగ్రస్థాయిలో ఉన్న సమయంలో నిఖిత వివాదంలో చిక్కుకుంది. కన్నడ నటుడు దర్శన్‌తో ఆమె ఉన్న సన్నిహిత సంబంధం పెద్ద దుమారానికి దారితీసింది. దర్శన్‌కు అప్పటికే వివాహం జరిగినప్పటికీ, వీరిద్దరి బంధం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.ఈ విషయం దర్శన్ భార్యకు తెలిసి, ఆమె నిఖితను హెచ్చరించినా, అది ఎలాంటి ఫలితం ఇవ్వలేదు. చివరికి దర్శన్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడం, దర్శన్ అరెస్టు కావడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ వివాదం కన్నడ చిత్రసీమలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఈ వివాదం అనంతరం కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నిఖితపై మూడు సంవత్సరాలపాటు నిషేధం విధించింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870