📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Actress: పొలిటికల్ ఎంట్రీపై రేణు దేశాయ్ క్లారిటీ

Author Icon By Saritha
Updated: January 19, 2026 • 6:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నటి (Actress) రేణు దేశాయ్ హైదరాబాద్‌లోని(Hyderabad) సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో, కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి రాబోనని స్పష్టం చేశారు. అయితే, సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, మూగజీవులపై జరుగుతున్న హింసపై తాను నిత్యం స్పందిస్తూనే ఉంటానని తెలిపారు. వీధి కుక్కల నిర్మూలన చర్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. వీటిని హత్యలుగా అభివర్ణిస్తూ, చిన్నపిల్లలను కరుస్తున్నాయనే కారణంతో కుక్కల పట్ల క్రూరంగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు.

Read Also: Bandla Ganesh: ఆ వెంకన్న ఆశీస్సులు గణేష్ కు ఉండాలి..

Renu Desai gives clarity on her political entry.

కుక్కల కోసం లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నా

లక్షల మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక చనిపోతున్నారని, దాని కోసం ఎవరూ పోరాడడం లేదని, కానీ కుక్కలు కరిస్తే పోరాటాలు చేస్తున్నారని రేణు దేశాయ్ అన్నారు. (Actress) ప్రతిరోజు తాను కుక్కలను కాపాడుతున్నానని, వాటి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నానని ఆమె చెప్పారు.

ఇప్పటికే ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల్లో ఎన్నో కుక్కలు యాక్సిడెంట్లలో చనిపోతున్నాయని.. బైక్‌, బస్సులు, కార్లు తగిలి కుక్కలకు తీవ్ర గాయాలు తగులుతున్నాయని.. వాహనదారుల వల్లే తమకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని కుక్కలు వెళ్లి కంప్లెయింట్ చేయలేవు కదా? అని ఆమె అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:



Latest News in Telugu politics clarification Press Club Hyderabad Rashmi Anchor renu desai Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.