📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Actress Pragathi: పవర్ లిఫ్టింగ్ పోటీలో గోల్డ్ మెడ‌ల్ గెలుచుకున్న నటి ప్రగతి

Author Icon By Anusha
Updated: August 7, 2025 • 11:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నటి ప్రగతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె తన సహజమైన అభినయంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నవారిలో ముందువరుసలో ఉంటారు. భార్యగా, తల్లిగా, వదినగా, సోదరిగా ఇలా అన్ని విధాలుగా సహాయ పాత్రల్లో ఆమె చేసిన పాత్రలు ఎంతో జీవంగా ఉంటాయి. తన నటన ద్వారా ప్రేక్షకులను కట్టిపడేసే ఈ నటి వెండితెరపై సుదీర్ఘ ప్రయాణం చేశారు.ప్రగతి జన్మస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా (Nellore District) ఉలవపాడు గ్రామం. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన ఆమె తల్లితో కలిసి చెన్నైకు తరలివెళ్లారు. చిన్నతనంలోనే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ప్రగతి కార్టూన్ పాత్రలకు గొంతు అందించేవారు. ఆమె గొంతుస్వరంలో ఉండే నాటకీయత, ఎక్స్‌ప్రెషన్‌ను గమనించినవారంతా ఆమెలో మంచి నటిని గుర్తించారు.

కెరీర్‌కు మైలురాయిగా

బీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సమయంలో ఆమె చెన్నైలోని మైసూర్ సిల్క్ ప్యాలెస్ బ్రాండ్‌కు చేసిన ప్రకటన ఆమెకు సినిమా అవకాశాలను తెచ్చిపెట్టింది. ఆ ప్రకటనను చూసిన ప్రముఖ తమిళ దర్శకుడు కె. భాగ్యరాజ్ ఆమెను ‘వీట్ల విశేషంగా’ అనే చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అది ఆమె కెరీర్‌కు మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత ఆమె తమిళ, మలయాళ సినిమాల్లోనూ నటించారు.వివాహం తర్వాత కొంతకాలం నటనకు విరామం తీసుకున్న ప్రగతి, మళ్లీ రీ ఎంట్రీతో తెలుగు సినిమా పరిశ్రమ (Film industry) పై దృష్టి పెట్టారు. ముఖ్యంగా కుటుంబ కథాచిత్రాల్లో ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘అతడి’, ‘నువ్వు లేక నేను లేను’, ‘సింహా’, ‘సరైనోడు’, ‘అల వైకుంఠపురములో’ వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో ఆమె గుర్తుండిపోయే పాత్రలు చేశారు.ప్రగతి ఫిట్‌నెస్‌కి ఎంతో ప్రాధాన్యత ఇస్తారన్న సంగతి తెలిసిందే. నిత్యం జిమ్‌తో కష్టపడుతూ ఆ వీడియోలని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేస్తుంటారు.

నేషనల్ మాస్టర్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్

ఇటీవల కాలంలో పవర్ లిఫ్టింగ్‌పై ఫోకస్ పెట్టిన ఆమె పోటీల్లో పాల్గొంటూ మెడల్స్ కూడా దక్కించుకుంటున్నారు. 2024లో జరిగిన సౌతిండియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ సాధించిన ఆమె తాజాగా కేరళలో జరిగిన నేషనల్ మాస్టర్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్‌తో రెండు సిల్వర్ పతకాలు కూడా సాధించి ఔరా అనిపించారు.50 ఏళ్ల ప్రగతి స్క్వాట్ 115 కిలోలు, బెంచ్ ప్రెస్ 50 కిలోలు, డెడ్‌లిఫ్ట్ 122.5 కిలోల కేటగిరీల్లో పాల్గొన్నారు. ఒకే ఈవెంట్‌లో ఒక గోల్డ్, రెండు సిల్వర్ మెడల్స్ సాధించడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మెడల్స్ అందుకోగానే స్టేజీపైనే ఎగిరి గంతేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఈ వయసులో తన శరీర ధారుడ్యాన్ని నిరూపించుకుంటూ, క్రీడా రంగంలో గోల్డ్ మెడల్ సాధించడం నిజంగా అందరికీ ప్రేరణగా నిలిచిందనే చెప్పాలి.

నటి ప్రగతి ఎవరు?

ప్రగతి ఒక ప్రముఖ తెలుగు నటి. ఆమె అనేక సినిమాల్లో తల్లి, అక్క, వదిన వంటి సహాయ పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

నటి ప్రగతి ఏ ప్రాంతానికి చెందినవారు?

నటి ప్రగతి ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలోని ఉలవపాడు గ్రామానికి చెందినవారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/mahavatar-narsimha-ott-release-update/cinema/527034/

bhagyaraja Breaking News dubbingartist latest news MalayalamCinema natipragati nellurudistrict supportiveroles TamilCinema Telugu News TeluguActress TeluguCinema ulavapadu veetlaaVishesham

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.