📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Actress Poorna: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నటి పూర్ణ

Author Icon By Anusha
Updated: March 14, 2026 • 2:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Actress Poorna: టాలీవుడ్ పాపులర్ నటి షమ్నా ఖాసీం, మనందరికీ ‘పూర్ణ’గా సుపరిచితురాలు, తన అభిమానులకు తీపి కబురు అందించారు. ఆమె రెండోసారి తల్లి అయ్యారు.. శనివారం (మార్చి 14) తెల్లవారుజామున తాను ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ, ఈ సంతోషకరమైన వార్తను పంచుకోవడంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read Also: Vishal-Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్

భావోద్వేగపూరిత పోస్ట్

ఈ సందర్భంగా పూర్ణ ఒక భావోద్వేగపూరిత పోస్ట్‌ను షేర్ చేసింది. “అల్లాహ్ ఆశీస్సులతో ఈరోజు ఉదయం 4 గంటల 25 నిమిషాలకు మా ఇంట‌ పాప పుట్టింది. ఆమె మా జీవితంలోకి వచ్చిన అమూల్యమైన కానుక. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా డెలివరీ జరిగినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సమయంలో సహకరించిన ఆసుపత్రి వైద్య బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు” అని ఆమె పేర్కొంది.

View this post on Instagram

A post shared by DrShanid Thalekoden (@dr.shanid_asifali)

పూర్ణ సినిమా కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే ప్రేమ వివాహం చేసుకుంది. 2022లో దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు 2023లో హమదన్ ఆసిఫ్ అలీ అనే బాబు పుట్టాడు. అనంతరం గత ఏడాది ఆగస్టులో మరోసారి గర్భవతి అయిన పూర్ణ ఇప్పుడు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Actress Poorna blessed with baby girl Shamna Kasim

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.