ప్రముఖ బ్రిటిష్ ఇండియన్ నటి, రచయిత్రి, నాటకకర్త మీరా సియాల్ (Meera Sial) కు మరో అరుదైన గౌరవం దక్కింది. 64 ఏళ్ల మీరా సియాల్‌కు ప్రతిష్ఠాత్మక డేమ్‌హుడ్ అవార్డు లభించింది. కొత్త సంవత్సరాది సందర్భంగా బ్రిటన్‌లో కింగ్ చార్లెస్-3 ప్రదానం చేసే అత్యున్నత పురస్కారాల్లో ఇదొకటి. సాహిత్యం, నాటకం, దాతృత్వ రంగాల్లో ఆమె అందించిన సేవలకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. లండన్‌లో డిసెంబరు 30న అవార్డు గ్రహీతల జాబితాను విడుదల చేశారు. మీరా సియాల్ ‘గుడ్‌నెస్ గ్రేషియస్ మి’, ‘ది కుమార్స్ ఎట్ నం.42’ వంటి కామెడీ సిరీస్‌ల ద్వారా గుర్తింపు పొందారు.
Read also: Pawan Kalyan: పొలిటికల్ డ్రామాగా పవన్ కొత్త సినిమా
నటనపై ఆసక్తి
ఇప్పటికే 1997లో క్వీన్ న్యూ ఇయర్ ఆనర్స్ సందర్భంగా ఆమెకు Member of the Order of the British Empire (MBE) పురస్కారం లభించింది. ఆ తర్వాత 2015లో Commander of the Order of the British Empire (CBE)గా కూడా ఆమెను నియమించారు. ఈ క్రమంలో ఇప్పుడు డేమ్‌హుడ్ లభించడం ఆమె కెరీర్‌లో మరో ఉన్నత మైలురాయిగా నిలిచింది. చిన్ననాటి నుంచే సాహిత్యం, నటనపై ఆసక్తి పెంచుకున్న ఆమె, ఆ తర్వాత కాలంలో బ్రిటన్ టెలివిజన్, థియేటర్, సాహిత్య రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: