ఈ రోజుల్లో తెలుగు సినిమాల్లో హీరోయిన్ పాత్రల ప్రాముఖ్యత తగ్గిపోతోంది అనే అభిప్రాయం బాగా వినిపిస్తోంది. గతంలో కథానాయకులు, కథానాయికల పాత్రలు సమానంగా ఉంటుండగా, ప్రస్తుతం హీరోయిన్ల పాత్రలు చాలాసార్లు ఫాలో అప్ లేదా బ్యూటీ కాన్సెప్ట్ లా మాత్రమే కనిపిస్తుంటాయి.దీంతో ప్రేక్షకులలోనూ విమర్శలు, అసంతృప్తి ఉత్పన్నమవుతున్నాయి.
భాగ్యశ్రీ బోర్సే
తాజాగా కింగ్డమ్‌లో భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) కు ఆ తరహా పాత్రే దక్కింది. 2.40 గంటల సినిమాలో.. పట్టుమని 15 నిమిషాలు కనబడలేదు ఈ బ్యూటీ.. ఉన్న ఒక్క పాటను తీసేసారు.
మీనాక్షి చౌదరి
గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి పాత్ర గుర్తుందా..? కేవలం ఆమ్లెట్ వేయడానికి, సైడ్‌లో అలా నించోడానికి మాత్రమే ఉంటుంది కానీ ఆ పాత్రకు ప్రాధాన్యత ఉండదు.
దిశా పటానీ
కల్కిలో దిశా పటానీ (Disha Patani) కూడా అంతే. ఏదో గ్లామర్ కోసమే పెట్టుకున్నారేమో అనిపిస్తుంది కానీ కథతో పనుండదు.
శృతి
ఈ మధ్య కేవలం రెమ్యునరేషన్ కోసమే నటిస్తున్నారేమో అనిపిస్తుంది. వకీల్ సాబ్, వీరసింహారెడ్డి, సలార్ లాంటి సినిమాల్లో శృతి పాత్ర కేవలం అలా వచ్చి పోతుంది కానీ కథలో భాగం కాదు.