📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telugu News: Tollywood: విజయ్ దేవరకొండ–రష్మిక మందన్నా జంట మళ్లీ ట్రెండ్‌

Author Icon By Pooja
Updated: November 7, 2025 • 2:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్(Tollywood) లో హాట్ జంటగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఈ ఇద్దరి పెళ్లి వార్తలు మళ్లీ అభిమానుల్లో ఉత్సాహం రేపుతున్నాయి. ఇటీవల వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు వార్తలు బయటకు రావడంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. అయితే ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

Read also: Prithviraj Sukumaran: SSMB29 లో ‘కుంభ’ పాత్రలో పృథ్వీరాజ్

రష్మికకు వరుస హిట్లు – విజయ్ నుంచి ప్రత్యేక విషెస్

‘నేషనల్ క్రష్’గా పేరొందిన రష్మిక ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌ పరిశ్రమల్లోనూ వరుస విజయాలు(Tollywood) సాధిస్తూ కెరీర్‌ పీక్‌లో ఉంది. తాజాగా ఆమె నటించిన ది గర్ల్ ఫ్రెండ్(The Girlfriend) చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండగా, రష్మికకు హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ తన పోస్ట్‌లో, “నాకు తెలుసు, ఇది శక్తివంతమైన సినిమా. కథా నేపథ్యం లోతైనది, ఆలోచనకు ప్రేరేపిస్తుంది. రష్మికతో పాటు నటీనటులందరి ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంది” అని రాశాడు.

రష్మిక రిప్లైతో అభిమానుల్లో హడావుడి

విజయ్ పోస్ట్‌కు రష్మిక కూడా స్పందిస్తూ, “అవును విజయ్.. ఈ సినిమా చాలా శక్తివంతమైనది. దీనిని జీర్ణించుకోవడం కష్టమే. నువ్వు ఎప్పటిలాగే పరోక్షంగా నా వెంట ఉన్నావు. ఈ సినిమా చూసిన తర్వాత నువ్వు నా మీద గర్వపడతావని నమ్ముతున్నాను” అని రాసింది. ఈ ఇద్దరి పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ వీరి కెమిస్ట్రీపై మళ్లీ చర్చలు మొదలుపెట్టారు. అంతేకాదు, ఇటీవల వీరి ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు సమాచారం వస్తుండటంతో, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

సినీ ఇండస్ట్రీలో మోస్ట్ లవ్డ్ జంట

‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల సమయంలోనే విజయ్–రష్మిక జంటకు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. అప్పటి నుంచి వీరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ, ఆఫ్‌స్క్రీన్ బాండింగ్ పై అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇప్పుడు పెళ్లి వార్తలు రావడంతో ఫ్యాన్స్ “ఫైనల్‌గా మోస్ట్ వేటెడ్ కపుల్ కలవబోతున్నారు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Latest News in Telugu The Girlfriend Movie Today news Tollywood Couple Tollywood News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.