దళపతి విజయ్ (Thalapathy Vijay) రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత… కోలీవుడ్‌లో “తదుపరి దళపతి ఎవరు? అనే ప్రశ్న మిన్నంటుతోంది. ఈ నేపథ్యంలో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) పేరు విస్తృతంగా వినిపిస్తోంది.సోషల్ మీడియాలో కొందరు శివకు ‘కుట్టి దళపతి’, ‘ఫ్యూచర్ దళపతి’ అనే బిరుదులు పెడుతున్నారు. అయితే, వీటిపై శివ కార్తికేయన్ స్పష్టత ఇచ్చారు. అన్న ఎప్పుడూ అన్నే. తమ్ముడు తమ్ముడే, అంటూ విజయ్ పట్ల గౌరవాన్ని వ్యక్తపరిచారు.శివ కార్తికేయన్ మాట్లాడుతూ, నాకు విజయ్ అభిమానులను ఆకర్షించే ఆలోచన లేదన్నారు. నా కష్టంతో నాకంటూ ఓ స్థానం ఏర్పడింది. నా అభిమానులు నాకు చాలు, అని చెప్పారు. 15 ఏళ్లుగా పరిశ్రమలో స్థిరంగా కొనసాగుతున్నాను అన్నారు.ఆయన తన అభిమానులకు కూడా ఓ ప్రత్యేకమైన విజ్ఞప్తి చేశారు. ట్రోల్స్‌పై స్పందించవద్దు. టైమ్ వేస్ట్ అవుతుంది,అన్నారు. సచిన్, ధోనీ లాంటి దిగ్గజులనూ విమర్శిస్తారంటూ ఉదాహరణ ఇచ్చారు.(Vaartha live news : Siva Karthikeyan)
సోషల్ మీడియాలో నెగటివిటీపై క్లియర్ స్టాండ్
ప్రతి ఒక్కరికి అభిప్రాయం ఉంటుంది. దాన్ని నమ్మాలి కానీ తక్కువ చేసుకోవద్దు, అని శివ చెప్పారు. మీరు సానుకూలంగా ఉండండి. ట్రోల్స్‌ను తలచుకోకండి, అని అభిమానులను ఓదార్చారు.ఈ వ్యాఖ్యలు ‘మదరాసి’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వచ్చాయి. శివ అక్కడ తన మనసులో మాట వెల్లడించారు. విజయ్‌తో తన సంబంధాన్ని ఎంతో హృదయపూర్వకంగా వివరించారు.ఈ వేడుకలో హీరోయిన్ రుక్మిణీ వసంత్ మాట్లాడుతూ, శివ నటన అద్భుతం. ఆయన ఆత్మీయంగా, అంకితభావంతో పని చేస్తారు, అన్నారు. ఆయనతో పని చేయడం గొప్ప అనుభవమని చెప్పారు.
మదరాసి చిత్రం విడుదలకు సిద్ధం
ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించారు. శివ కార్తికేయన్ ఓ కొత్త కోణంలో కనిపించనున్న ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదలవుతోంది.‘మదరాసి’ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ అదే రోజున విడుదల కాబోతోంది. తెలుగు ప్రేక్షకులకు ఇది ఓ వినోదాత్మక ట్రీట్ అవుతుంది.
Read Also :