సమంత మరియు రాజ్( SamRaj) నిడుమోరు పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ అవుతున్నాయి. ఈ చిత్రాల్లో సమంత ధరించిన అందమైన దుస్తులతో పాటు ఆమె చేతికి మెరిసే వెడ్డింగ్ రింగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Read Also: Samantha: పెళ్లి రోజే నాగచైతన్య పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్

అరుదైన ‘పోట్రెయిట్ కట్’ డిజైన్
సమంత( SamRaj) ధరించిన ఈ వెడ్డింగ్ రింగ్ గురించి ఒక ప్రముఖ జ్యువెలరీ వ్యాపారి ఆసక్తికర వివరాలు వెల్లడించారు. ఈ ఉంగరం మొఘల్ కాలం నుంచి ఉద్భవించిన అరుదైన డిజైన్ అని చెప్పారు. ‘పోట్రెయిట్ కట్’గా పిలువబడే ఈ శైలి, ధారకుడి స్వచ్ఛత మరియు నిష్కళంకతను సూచించే చిహ్నంగా భావిస్తారని తెలిపారు.
చరిత్రకారుల ప్రకారం, మొఘల్ చక్రవర్తి షాజహాన్ భార్య ముంతాజ్ ఇలాంటి ప్రత్యేక కట్ ఉంగరాలను ఎంతో ఇష్టపడేదని సమాచారం. ఈ డిజైన్ తయారీ కోసం వజ్రాన్ని చాలా నిష్ణాతంగా కట్ చేసి, పలుచని గాజు పలకలా తీర్చిదిద్దాల్సి ఉంటుందని నిపుణులు చెప్పారు. అందువల్ల ఈ రకం రింగులు చాలా అరుదుగా తయారవుతాయి. జ్యువెలరీ వ్యాపారి వివరాల ప్రకారం, సమంత చేతి ఉంగరం దాదాపు ₹1.5 కోట్లు విలువ చేయనున్నట్లు అంచనా.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: