News Telugu: Salman Khan: సల్మాన్ ఖాన్ కు షాక్.. కోర్టు నోటీసులు

Read Time:  1 min
Salman Khan: సల్మాన్ ఖాన్ కు షాక్..
Salman Khan: సల్మాన్ ఖాన్ కు షాక్..
FONT SIZE
GET APP


Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (salman khan) కు ఊహించని షాక్ తగిలింది. ఆయన ఓ పాన్ మసాల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రకటన విషయంలో కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. సల్మాన్ ఖాన్ ప్రచారం చేసిన యాడ్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ఆరోపిస్తూ రాజస్థాన్ లో వినయోగదారుల కోర్టులో ఆయనపై ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ పిటిషన్ పై కోర్టు స్పందించింది. సల్మాన్ ఖాన్ తో సహా ఆ పాన్ మసాల తయారీ సంస్థకు నోటీసులు పంపించింది. సల్మాన్ ఖాన్ పై ఫిర్యాదు చేసిన మోహన్ సింగ్ హానీ బీజేపీ సీనియర్ నాయకులు, రాజస్థాన్ హైకోర్టు న్యాయవాది ఇందర్ మోహన్ సింగ్ హానీ సల్మాన్ ఖాన్ పై ఫిర్యాదు దాఖలు చేశారు.

Read also: Rajasekhar: ఏ పాత్ర అయినా చేయడానికి సిద్ధం: రాజశేఖర్

Salman Khan: సల్మాన్ ఖాన్ కు షాక్..

Salman Khan: సల్మాన్ ఖాన్ కు షాక్..

Salman Khan: రాజశ్రీ పాన్ మసాలా ప్రకటనల్లో కుంకుమపువ్వు కలిపిన యాలకులు, కేసరి కలిపిన పాన్ మసాల వంటి వాటిపై ఆయన తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసర్ ధ కిలోకు రూ.4లక్షలు ఉంది. కానీ రూ.5కే అమ్మే పాన్ మసాల ప్యాకెట్ లో కేసర్ ఉండటం ఏంటని? ఇది అసాధ్యమని ఆయన అన్నారు. ఈ యాడ్ ద్వారా ప్ మసాలా కంపెనీ, సల్మాన్ ఖాన్ ఇద్దరూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వాదించారు. మోహన్ సింగ్ వాదనలు వినియోగదారుల కోర్టు సీరియస్గా తీసుకుంది. కేసు తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

    Rajitha

    రచయిత గురించి

    Rajitha

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.