Salman Khan : సల్మాన్ ఇంటికి భారీగా తరలివచ్చిన అభిమానులు

Read Time:  1 min
Salman Khan సల్మాన్ ఇంటికి భారీగా తరలివచ్చిన అభిమానులు
Salman Khan సల్మాన్ ఇంటికి భారీగా తరలివచ్చిన అభిమానులు
FONT SIZE
GET APP

Salman Khan : సల్మాన్ ఇంటికి భారీగా తరలివచ్చిన అభిమానులు బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ఈ ఏడాది రంజాన్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముంబయిలోని తన నివాసం వద్ద భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. వారందరికీ ఆయన అభివాదం చేస్తూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.అయితే ప్రతి ఏడాది ఈద్ వేడుకల్లో తన ఇంటి బాల్కనీ నుంచి అభిమానులకు అభివాదం చేసే సల్మాన్, ఈసారి మాత్రం బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనుక నుంచి దర్శనమివ్వడం విశేషం. గతంలో జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంలో ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దీంతో బాల్కనీకి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ, అభిమానులను నిరాశపరచకూడదనే ఉద్దేశంతో, సల్మాన్ వాటి వెనుక నుంచే అందరికీ అభివాదం చేశారు.

Salman Khan సల్మాన్ ఇంటికి భారీగా తరలివచ్చిన అభిమానులు
Salman Khan సల్మాన్ ఇంటికి భారీగా తరలివచ్చిన అభిమానులు

తెల్లని పఠానీ సూట్‌లో కనిపించిన సల్మాన్ ఖాన్, బుల్లెట్ ప్రూఫ్ గ్లాసుల వెనుక నుంచే “షుక్రియా, థాంక్యూ, సబ్ కో ఈద్ ముబారక్” అంటూ అభిమానులకు ప్రేమను వ్యక్తం చేశారు.గతేడాది ఏప్రిల్‌లో గుర్తు తెలియని వ్యక్తులు సల్మాన్ ఖాన్ నివాసంపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఆయన భద్రతను మరింతగా పెంచారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఈ దాడికి సంబంధించి కీలకంగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనివల్లే ఈద్ వేడుకల్లో సల్మాన్ బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనుక నుంచి అభివాదం చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ, అభిమానుల ప్రేమకు ఆయన సముచితంగా స్పందించారు.

Divya Vani M

రచయిత గురించి

Divya Vani M

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.