📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సైఫ్ అలీ ఖాన్ ఆస్తులు స్వాధీనం కానున్నాయి

Author Icon By Divya Vani M
Updated: January 22, 2025 • 10:54 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత కొన్ని రోజులుగా కత్తిపోట్లకు గురై కోలుకుంటున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌కు మరో భారీ షాక్ తగిలింది.సైఫ్ కుటుంబానికి చెందిన రూ. 15 వేల కోట్ల విలువైన ఆస్తులు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి స్వాధీనం కానున్నాయి. ఈ ఆస్తులు భోపాల్‌లో ఉన్నాయి.సైఫ్ అలీ ఖాన్ పటౌడీ రాజవంశానికి చెందిన వ్యక్తి అని అందరికీ తెలిసిందే.ఆయన ముత్తమ్మమ్మ అబీదా సుల్తాన్ 1947లో భారతదేశ విభజన సమయంలో పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు, తన ఆస్తులను అక్కడ వదిలి వేదికైనారు.అప్పటి భారత ప్రభుత్వం, దేశాన్ని వదిలి పాకిస్థాన్‌కు వెళ్లిపోయిన వారి ఆస్తులు “ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1968” కింద వస్తాయని ప్రకటించింది.ఆ ఆస్తుల విలువ ప్రస్తుతం రూ. 15 వేల కోట్లుగా ఉంటుంది.2014లో సైఫ్‌కు సమస్యలు మొదలయ్యాయి. ఆ ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా ప్రకటిస్తూ,ఎనిమీ ప్రాపర్టీ డిపార్ట్‌మెంట్ నోటీసులు జారీ చేసింది. “ఎనిమీ చట్టం” ప్రకారం ఆ ఆస్తి మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి చెందుతుంది.అయితే, సైఫ్ దీనిని తమ వారసత్వ ఆస్తిగా భావించి, మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

సైఫ్ అలీ ఖాన్ ఆస్తులు స్వాధీనం కానున్నాయి

తనకు ఆ ఆస్తిపై పూర్తిగా హక్కులు ఉన్నాయని తెలిపారు.హైకోర్టు ఆ పిటిషన్‌ను విచారించి స్టే ఇచ్చింది. కానీ, 2024 డిసెంబర్ 13న ఆ స్టేను ఎత్తివేసింది.హైకోర్టు సైఫ్ యొక్క పిటిషన్‌ను కొట్టివేసింది.అయితే, 30 రోజుల్లోపు అప్పీల్ ట్రైబ్యునల్‌లో అప్పీల్ చేయొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.అయితే, కోర్టు ఉత్తర్వులపై సైఫ్ కుటుంబం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో, రూ.15 వేల కోట్ల ఆస్తి మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి దక్కబోతుంది. ఆ ఆస్తిని స్వాధీనం చేసుకునే ప్రక్రియలు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించినట్టు సమాచారం.ఈ నేపథ్యంలో సైఫ్ అలీ ఖాన్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా? లేక ఆ ఆస్తిని వదిలేస్తారా? అనేది త్వరలో తేలిపోవాలి.

Enemy Property Act Madhya Pradesh government Pataudi family Royal family properties Saif Ali Khan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.