Akshara chit fund scam : చిట్ ఫండ్ మోసం శ్రీనివాసరావు కస్టడీలో

Read Time:  1 min
Akshara chit fund scam
Akshara chit fund scam
FONT SIZE
GET APP

Akshara chit fund scam : డిపాజిటర్లను మోసం చేసి గత ఆరు నెలలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న అక్షర చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ పేరాల శ్రీనివాసరావును ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. చిట్టీల పేరిట డబ్బులు సేకరించి మోసానికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

Read Also: Indane Gas New Booking Numbers: ఇండేన్ గ్యాస్ కొత్త బుకింగ్ నంబర్లు ఇవే!

Akshara chit fund scam
Akshara chit fund scam

ఒక్క ఆదిలాబాద్‌లోనే 12 కేసుల్లో సుమారు రూ.1.11 కోట్లు మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 96 చీటింగ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి అరెస్టు చేసినట్లు, అతని నుంచి ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అతని ఆస్తులను కూడా చట్టప్రకారం జప్తు చేసే ప్రక్రియ కొనసాగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.