📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telugu News:Nara Rohit: పెళ్లి పీటలు ఎక్కబోతున్న నారా రోహిత్.. ముహూర్తం ఎప్పుడంటే?

Author Icon By Pooja
Updated: October 22, 2025 • 3:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్ హీరో నారా రోహిత్,(Nara Rohit) నటి సిరిలేళ్ల త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇటీవలే వీరి పెళ్లి పనులు కూడా ప్రారంభమైనట్లు తెలుపుతూ, సిరిలేళ్ల పసుపు దంచే కార్యక్రమం ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వీరి వివాహ తేదీకి సంబంధించిన అప్‌డేట్ తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ జంట అక్టోబర్ 30న వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఆ రోజు మూడు ముళ్ల బంధంతో ఈ జంట ఒకటి కానుంది.

Read Also: Telangana: 30న విద్యాసంస్థలకు బంద్ పిలుపునీచిన ఎస్ఎఫ్‌ఐ

Nara Rohit: పెళ్లి పీటలు ఎక్కబోతున్న నారా రోహిత్.. ముహూర్తం ఎప్పుడంటే?

హైదరాబాద్‌లో నాలుగు రోజుల వేడుకలు

నారా రోహిత్(Nara Rohit), సిరిలేళ్ల వివాహ వేడుకలు దాదాపు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. హైదరాబాద్‌లో(Hyderabad) పలు వేదికల్లో ఈ వేడుకలు ఏర్పాటు చేశారు. తెల్లాపూర్‌లోని మండువా ప్రాంగణంలో హల్దీ వేడుకలతో వివాహ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత, ఐటీసీ గ్రాండ్ కాకతీయలో ‘పెళ్లి కొడుకును చేసే’ వేడుక నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం మళ్లీ మండువా ప్రాంగణంలో మెహందీ వేడుక జరగనున్నట్లు సమాచారం. వీరి వివాహ వేడుకలకు సినీ తారలు మరియు రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

Nara Rohit Marriage Siri Leella Today news Tollywood Wedding

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.