MBU kidnap case : హీరో మంచు విష్ణుకు పెద్ద షాక్ తగిలింది.

Read Time:  1 min
MBU kidnap case
MBU kidnap case
FONT SIZE
GET APP

MBU kidnap case : తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీ (MBU)లో విద్యార్థి నేతల కిడ్నాప్ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

ఇటీవల MBUలో ఫీజుల దోపిడీ ఆరోపణలపై విద్యార్థి సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఎస్‌ఎఫ్‌ఐ (SFI) విద్యార్థి నేతలను యూనివర్సిటీ యాజమాన్యం కిడ్నాప్ చేసిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also: AP: పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం

MBU kidnap case
MBU kidnap case

ఈ కేసులో యూనివర్సిటీ పీఆర్‌ఓ సతీశ్‌ను ఏ1గా, హీరో మంచు విష్ణును ఏ2గా, ఆయన తండ్రి నటుడు మంచు మోహన్ బాబును ఏ3గా పోలీసులు నమోదు చేశారు. ఇప్పటికే పీఆర్‌ఓ సతీశ్‌తో పాటు పలువురు బౌన్సర్లను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ క్రమంలో కేసును కొట్టివేయాలని కోరుతూ మంచు మోహన్ బాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. యూనివర్సిటీ యాజమాన్యం ప్రోత్సాహంతోనే ఈ కిడ్నాప్ ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం టాలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.