సీఎం రేవంత్ రెడ్డిని చిరంజీవి విమర్శించారా?

Read Time:  1 min
chiranjeevi
chiranjeevi
FONT SIZE
GET APP

ఇప్పుడు టాలీవుడ్‌లో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా చాలా హైప్‌ అందుకుంది.2024 డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా, ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందింది.అయితే, ఈ సినిమా ప్రీమియర్ షోలో జరిగిన ఘటన ఒక నిరాశకరమైన పరిణామాన్ని తెచ్చింది.డిసెంబర్ 4న అల్లు అర్జున్ ప్రీమియర్ షోను చూసేందుకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు వెళ్లారు.ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయింది.ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ సంఘటన సంభవించిన తర్వాత పోలీసులు అల్లు అర్జున్ మరియు థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.ఈ కేసులో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి, నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. అయితే, హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు.తొక్కిసలాట ఘటన గురించి వివరించిన ఆయన, అల్లు అర్జున్ పట్ల తీసుకున్న చర్యలను కూడా స్పష్టం చేశారు. అయితే, అల్లు అర్జున్ కేసును సంబంధించి ఒక వైరల్ వీడియో బయటకొచ్చింది.ఈ వీడియోలో, మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నట్లు చూపించబడింది.ఈ వీడియో మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, రేవంత్ రెడ్డి, చిరంజీవి మధ్య ఒక వివాదం వున్నట్లు అనిపించింది.కానీ,ఈ వీడియోను ఫ్యాక్ట్ చెక్ చేసినప్పుడు, అది పూర్తిగా తప్పు అని తేలింది. చిరంజీవి అసలు రేవంత్ రెడ్డిని విమర్శించలేదు.ఈ వీడియో ఒక పాత వీడియోని అల్లు అర్జున్ కేసుతో సంబంధం పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి, ఈ వీడియో ఆగస్టు 10, 2023న యూ వె మీడియా యూట్యూబ్ ఛానల్‌లో “వాల్తేరు వీరయ్య 200-రోజుల సెలబ్రేషన్లలో మెగాస్టార్ చిరంజీవి ప్రసంగం” అనే టైటిల్‌తో అప్‌లోడ్ చేసినట్లు తెలుస్తోంది.

Divya Vani M

రచయిత గురించి

Divya Vani M

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.