हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

మీకు కూడా ఇలా కాల్స్ మెసేజ్‌లు వస్తాయి జాగ్రత్త.. విజయ్

Divya Vani M
మీకు కూడా ఇలా కాల్స్ మెసేజ్‌లు వస్తాయి జాగ్రత్త.. విజయ్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ఫుల్ జోష్‌లో ఉన్నాడు.గత ఏడాది ఖుషి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విజయ్, ఈ ఏడాది కూడా తన ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు.వరుస విజయాలతో విజయ్ ఇప్పుడు గౌతమ్ తిన్న నూరి డైరెక్షన్‌లో ఒక ప్రాజెక్ట్ చేస్తుండగా,తనకు ట్యాక్సీవాలా లాంటి హిట్ ఇచ్చిన రాహుల్ సాంకృత్యాన్‌తో మరో సినిమాచేస్తున్నాడు.ఇటీవలి కాలంలో విజయ్ నటించిన కొన్ని సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి.అందుకే ఇప్పుడు చాలా జాగ్రత్తగా కథలను ఎంచుకుంటూ అడుగులు వేస్తున్నాడు.గీత గోవిందం తర్వాత అదే స్థాయి హిట్ కొట్టేందుకు కష్టపడుతున్న విజయ్, ప్రస్తుతం రెండు పెద్ద ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉన్నాడు.

vijay devarakonda
vijay devarakonda

ఇటీవల విజయ్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఓ ఆసక్తికర వీడియో షేర్ చేశాడు. వీడియోలో తన స్నేహితుడి అనుభవాన్ని పంచుకుంటూ,అందరికీ హెచ్చరికగా ఓ సందేశం ఇచ్చాడు.విజయ్ చెబుతూ, “నా స్నేహితుడికి ఇటీవల ఓ అనామక కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి, ‘మీ నాన్న వద్ద 5000 రూపాయలు తీసుకున్నాను.ఇప్పుడు మీ ఖాతాకు తిరిగి పంపించాలనుకుంటున్నా’ అని చెప్పాడు. దీనికి నా స్నేహితుడు సరే అన్నాడు. కొంత సమయం తర్వాత స్నేహితుడి అకౌంట్‌లో 50 వేల రూపాయలు జమ అయ్యాయి. తర్వాత ఆ వ్యక్తి మళ్లీ కాల్ చేసి, ‘5000 రూపాయలు పంపాల్సింది.పొరపాటున 50 వేలు పంపాను. ఇప్పుడే 45 వేలు తిరిగి పంపించండి.

నా భార్య ఆసుపత్రిలో ఉంది.డబ్బు చాలా అవసరం’ అని తడిగాడు.ఈ ఘటనను చెబుతూ విజయ్, “ఇలాంటి కాల్‌లు వస్తే జాగ్రత్తగా ఉండండి. తక్షణమే డబ్బు పంపించొద్దు.ముందు ఆ వివరాలను సరిచూసుకోండి. నా స్నేహితుడికి జరిగిన ఇలాంటి మోసం,మీకు కూడా జరగకూడదు”అని అభిమానులకు హెచ్చరించాడు.విజయ్ తన నటనతో మాత్రమే కాకుండా వ్యక్తిత్వంతో కూడా అభిమానుల గుండెల్లో చోటు సంపాదించాడు. నిజాయితీ, జాగ్రత్తలు అలవాటు చేసుకునేలా తన అభిమానులకు పాఠాలు చెప్పడంలో విజయ్ ప్రత్యేకత.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870