हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

నటుడు అమన్ జైస్వాల్ మృతి

Divya Vani M
నటుడు అమన్ జైస్వాల్ మృతి

సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి.ప్రముఖ హిందీ సీరియల్ నటుడు అమన్ జైస్వాల్ దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతడి వయసు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే.ముంబైలోని జోగేశ్వరి హైవేపై ఆయన ప్రయాణిస్తున్న బైక్‌ను ఓ ట్రక్కు ఢీకొట్టింది.ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అమన్‌ను సమీప ఆసుపత్రికి తరలించినా,చికిత్స పొందుతూ అరగంటలోనే ప్రాణాలు కోల్పోయాడు.ఈ విషాదకర ఘటనపై సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.అమన్ జైస్వాల్ మృతిని రచయిత ధీరజ్ మిశ్రా ధృవీకరించారు.

ప్రముఖ హిందీ నటుడు అమన్ జైస్వాల్ మృతి
ప్రముఖ హిందీ నటుడు అమన్ జైస్వాల్ మృతి

ఓ సీరియల్ ఆడిషన్ కోసం వెళ్లిన అమన్, తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జోగేశ్వరి హైవేపై అతడు ప్రయాణిస్తున్న బైక్‌ను ట్రక్కు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.అమన్ జైస్వాల్ “ధర్తిపుత్ర నందిని” సీరియల్‌తో మంచి పేరు సంపాదించాడు.ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాకు చెందిన అమన్, ఆ సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషించాడు. అంతేకాకుండా,సోనీ టీవీలో ప్రసారమైన “పుణ్యశ్లోక్ అహల్యాబాయి” సీరియల్‌లో యశ్వంత్ రావు పాత్రలో కనిపించాడు. 2021లో ప్రారంభమైన ఈ సీరియల్ 2023లో ముగిసింది.మోడలింగ్‌తో తన కెరీర్‌ను మొదలుపెట్టిన అమన్, బైక్ రైడింగ్‌కు ఎంతగానో ఆసక్తి చూపించేవాడు.అతడి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్నో బైక్ రైడింగ్ వీడియోలు ఉన్నాయి.

అతడు మంచి గాయకుడిగా కూడా పేరొందాడు.అమన్‌ మృతి వార్తతో బుల్లితెర నటీనటులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అమన్ స్నేహితుడు అభినేష్ మిశ్రా మాట్లాడుతూ, అమన్ ప్రమాదంలో గాయపడిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లామని, కానీ అక్కడ చేరిన కొద్ది సేపటికే అతడు మృతిచెందాడని తెలిపారు. ఆడిషన్‌కు సంబంధించిన స్క్రీన్ టెస్ట్ పూర్తి చేసుకుని తిరిగివస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు.”ధర్తిపుత్ర నందిని” సీరియల్‌లో ప్రధాన పాత్రతోBefore దక్కిన గుర్తింపు కాకుండా, అమన్ చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించాడు. అమన్ అకాల మరణం అతడి కుటుంబం, స్నేహితులు, అభిమానులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఈ బాధ నుంచి వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దాం.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870