Vinayakan: ఆసుప‌త్రిలో చేరిన న‌టుడు వినాయకన్

Read Time:  1 min
Vinayakan: ఆసుప‌త్రిలో చేరిన న‌టుడు వినాయకన్
FONT SIZE
GET APP

‘జైలర్’ మూవీ నటుడు వినాయకన్ (Vinayakan) ఆసుపత్రిలో చేరారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ సినిమా (‘Jailer’ movie) లో విలన్ పాత్రతో వినాయకన్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ సినిమాలో ఆయన నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఇటీవల ‘ఆడు-3’ సినిమా షూటింగ్ సమయంలో స్టంట్లు చేస్తుండగా గాయపడిన ఆయనను కొచ్చిలోని ఆస్పత్రికి తరలించారు.

Read Also: Ram Pothineni: ఓటీటీలో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి పాజిటివ్ రెస్పాన్స్

Actor Vinayakan has been admitted to the hospital
Actor Vinayakan has been admitted to the hospital

షూటింగ్‌ కు బ్రేక్

ఈ మేరకు MRI స్కాన్‌లో ఆయన (Vinayakan) మెడలోని నరాలు దెబ్బతినడం, కండరాలకు గాయాలు అయ్యాయని తేలింది. దీంతో 6 వారాల పాటు బెడ్ రెస్టు తీసుకోవాలని వైద్యులు సూచించారు. ‘ఆడు 3’ సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. మరోవైపు జయసూర్య హీరోగా నటిస్తున్న ఓ ఎపిక్ ఫాంటసీ చిత్రంలో కూడా వినాయకన్ కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ రావాల్సి ఉందని సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.