📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Actor Suriya: ఆమె దగ్గర నుంచి తీసుకున్న రూ.25,000 అప్పు.. తీర్చేందుకే నటుడిగా మారిన సూర్య

Author Icon By Divya Vani M
Updated: October 25, 2024 • 3:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య దక్షిణాది సినీ పరిశ్రమలో తన ప్రత్యేకతతో నిలిచిపోయారు ఆయన విభిన్నమైన పాత్రలు అనేక సూపర్‌హిట్ చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు సూర్య అత్యుత్తమ నటనకు గాను జాతీయ అవార్డుతో సత్కరించబడ్డారు హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ప్రేక్షకులను అలరిస్తూ సీనీ పరిశ్రమలో తనదైన ముద్రవేశారు సూర్య అనేక సందర్భాల్లో తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిన్నప్పటి నుంచి నటుడిగా మారాలని తనకు ఎప్పుడూ తలంపు రాలేదని, కానీ తన తల్లి ఋణం తీర్చుకునేందుకు మాత్రమే సినీ రంగంలోకి అడుగుపెట్టినట్లు తెలిపారు తన తండ్రి శివకుమార్ కూడా దక్షిణాదిలో ప్రముఖ నటుడు. సూర్య తల్లి దగ్గర రూ. 25 వేలు అప్పు తీసుకొని ఆ రుణాన్ని తీర్చేందుకు మాత్రమే సినిమాల్లో నటించేందుకు అంగీకరించినట్లు చెప్పారు. 1997లో ‘నెరుక్కు నాయర్’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు.

నటుడిగా మారేముందు సూర్య తన జీవితం గురించి వెల్లడిస్తూ 15 రోజులకు 750 రూపాయలు సంపాదించే గార్మెంట్ కంపెనీలో పనిచేశానని అన్నారు. అక్కడ పనిచేసే సమయంలో మూడు సంవత్సరాల తరువాత నెలకు రూ. 8 వేల జీతం వచ్చేదని, ఒకరోజు సొంత కంపెనీ పెట్టాలనే కల కూడా ఉందని వెల్లడించారు. అయితే, తల్లి పట్ల ఉన్న బాధ్యతే తనను నటుడిగా మార్చిందని చెబుతారు. ప్రస్తుతం సూర్య తన తాజా చిత్రం ‘కంగువా’ లో నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా నవంబర్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ భారీ బడ్జెట్ సినిమా పలు భాషల్లో విడుదల అవుతోంది. సూర్యకు ఈ సినిమాలో ప్రత్యేకమైన గెటప్ ఉంది, ఇది అభిమానుల అంచనాలను భారీగా పెంచింది. బాలీవుడ్ నటులు బాబీ డియోల్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు, ఈ కాంబినేషన్ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.

    Bobby Deol in Kanguva Disha Patani in Tamil Cinema Kanguva Movie Kollywood News South Indian Cinema Suriya Suriya Life Story Suriya National Award Tamil Cinema Upcoming Releases Tamil Movie Industry

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.