సామాజిక మాధ్యమాల వినియోగం పిల్లల జీవితాలపై చూపిస్తున్న ప్రభావం గురించి బాలీవుడ్ నటుడు (Actor), రియల్ హీరోగా గుర్తింపు పొందిన సోనూ సూద్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో పిల్లలు భోజనం చేస్తూ కూడా ఫోన్లు స్క్రోలింగ్ చేస్తున్నారని, ఆ విషయాన్ని తల్లిదండ్రులు సైతం పట్టించుకోకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఇది మన భవిష్యత్తు కాకూడదని హెచ్చరించారు.
Read Also: Shraddha Kapoor: అల్లు అర్జున్ సరసన శ్రద్ధా?
ప్రధాని నరేంద్ర మోదీకి రిక్వెస్ట్
ఈ క్రమంలోనే 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను దూరం చేయడం తక్షణ అవసరమని సోనూ సూద్ పేర్కొన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేసిందని, త్వరలో గోవా ప్రభుత్వం కూడా దీనిని అనుసరించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిని ఒక జాతీయ ఉద్యమంగా మార్చాలని గౌరవప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ, పిల్లల మానసిక ఆరోగ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సోనూ సూద్ స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: