📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Rajasekhar: నాకు గోలీల ఫ్యాక్టరీ ఉందా? రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నటుడు రాజశేఖర్!

Author Icon By Tejaswini Y
Updated: March 14, 2026 • 5:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Rajasekhar: సోషల్ మీడియాలో గత కొంతకాలంగా తనపై వస్తున్న ఆసక్తికరమైన ప్రచారంపై టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ స్పందించారు. రాజశేఖర్‌కు ‘గోలీల’ (Marble) ఫ్యాక్టరీ ఉందంటూ, దాని ద్వారా ఆయన కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారంటూ వైరల్ అవుతున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు.

Read Also : Anil Kapoor Dhurandhar 2: ఆఫర్‌ను తిరస్కరించిన అనిల్ కపూర్.. కారణం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

Rajasekhar: Do I have a goalie factory? Actor Rajasekhar clarifies on rumors!

అసలు ప్రచారం ఏమిటి?

“రాజశేఖర్‌కు గోలీల వ్యాపారం ఉంది.. బంగ్లాదేశ్, పాకిస్థాన్, భారత్ వంటి దేశాల్లో గోలీలను విక్రయిస్తూ ఆయన నెలకు రూ. 3 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు సంపాదిస్తున్నారు” అనే వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి. ఇది నిజమేనని నమ్మి చాలామంది ఆయనను నేరుగా కూడా ప్రశ్నించారట.

రాజశేఖర్ ఏమన్నారంటే?

ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రాజశేఖర్ ఈ విషయంపై మాట్లాడుతూ.. “నాకు ఎలాంటి గోలీల ఫ్యాక్టరీ లేదు. ఆ వీడియోలు చూసి నాకు నేనే నవ్వుకున్నాను. నాకు ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? కోట్ల రూపాయల సంపాదన ఎక్కడ ఉంది అని ఆశ్చర్యపోయాను. తెలిసిన వారు కూడా ఫోన్ చేసి ‘నిజంగానే ఫ్యాక్టరీ ఉందా?’ అని అడుగుతుంటే వింతగా అనిపించింది” అని స్పష్టం చేశారు.

ఇమిటేషన్లపై స్పందన:

తనను ఇమిటేట్ చేసే వారి గురించి కూడా రాజశేఖర్ సరదాగా మాట్లాడారు. “మొదట్లో ఎవరైనా నన్ను ఇమిటేట్ చేస్తే నిజంగా నేను అలాగే చేస్తానా? అనిపించేది. ముఖ్యంగా దర్శకుడు అనిల్ రావిపూడి నన్ను, వెంకటేష్‌ను చాలా బాగా ఇమిటేట్ చేస్తారు. ‘రోజా పువ్వా’ పాటలో నేను చేసిన స్టెప్పులు నాకే గుర్తు లేవు కానీ, ఎవరైనా స్టేజ్‌పై అది చేస్తే చూసి ఎంజాయ్ చేస్తాను” అని చెప్పుకొచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Actor Rajasekhar Interview Rajasekhar Rajasekhar Marble Business Social Media Rumors

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.