ప్రముఖ నటుడు (Actor), మోహన్‌బాబు కు మరో అరుదైన గౌరవం దక్కింది.. కళారంగానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డును ఆయన అందుకున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక వేడుకల్లో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును మోహన్‌బాబుకు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పాటు, ఆయన అభిమానుల్లో ఆనందాన్ని రెట్టింపు చేశాయి.తెలుగు నటుడి (Actor) కి ఈ గౌరవం లభించడం ఇదే తొలిసారి కావడం విశేషంగా నిలిచింది. అభిమానులు, సినీ ప్రముఖులు మోహన్‌బాబుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Read Also: Vijay Deverakonda: గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ గ్లింప్స్
గర్వించదగ్గ విషయం
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఒక తెలుగు నటుడికి ఎక్సలెన్స్ అవార్డును ప్రదానం చేయడం ఇదే మొదటిసారి కానుంది. తెలుగు సినిమా ప్రస్తుతం భారత సాంస్కృతిక, సంప్రదాయాల్ని ప్రపంచానికి చాటి చెబుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో తెలుగు సినిమా పరిశ్రమకి యాభై ఏళ్లకు పైగా సేవలందించిన మోహన్ బాబు గారికి ఈ అవార్డుని ప్రదానం చేయడం గర్వించదగ్గ విషయం.
ఈ అవార్డు మోహన్ బాబు గారి సినీ జీవితంలో ఒక అద్భుతమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ అవార్డు.. కళామతల్లికి 50 సంవత్సరాలకు పైగా ఆయన చేసిన సేవ, ఆయన నిరాడంబరమైన జీవితం, భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా ఎదగడం వరకు, ఆయన చేసిన సుదీర్ఘ ప్రయాణం, క్రమశిక్షణ, పట్టుదలకి నిదర్శనంగా నిలుస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: