Abhishan Jeevinth: ‘విత్ లవ్’ మూవీపై అనిల్ రావిపూడి ప్రశంసలు

Read Time:  1 min
Abhishan Jeevinth: ‘విత్ లవ్’ మూవీపై అనిల్ రావిపూడి ప్రశంసలు
FONT SIZE
GET APP

టాలీవుడ్‌లో వరుస హిట్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి, ఇటీవల విడుదలైన తమిళ సినిమా ‘విత్ లవ్’ (With Love)పై ప్రశంసల వర్షం కురిపించారు. ఫిబ్రవరి 6, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను చూసిన అనిల్ రావిపూడి, సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇటీవలి కాలంలో వచ్చిన ఒక ఆహ్లాదకరమైన (Breezy), చక్కని రొమాంటిక్ కామెడీ ఇదని, ముఖ్యంగా తెలుగు డైలాగులు చాలా సందర్భోచితంగా, నీట్‌గా ఉన్నాయని ఆయన కొనియాడారు.

Read Also: Anju Krishna: డ్రగ్స్ కేసులో నటి అరెస్ట్?

టూరిస్ట్ ఫ్యామిలీ ద‌ర్శ‌కుడు, హీరో అభిషన్ జీవింత్ (Abhishan Jeevinth) , హీరోయిన్ అనస్వ‌ర రాజన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారని, వారి పెర్ఫార్మెన్స్ ఎంతో బాగుందని ప్రశంసించారు. అలాగే షాన్ రోల్డన్ అందించిన సంగీతం సినిమాకు అద్భుతంగా కుదిరిందని పేర్కొన్నారు.డెబ్యూ డైరెక్టర్ మదన్ పనితీరును మెచ్చుకుంటూ, ఆయనకు దర్శకుడిగా మంచి భవిష్యత్తు ఉందని అనిల్ రావిపూడి ఆకాంక్షించారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన రానా దగ్గుబాటి, సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్‌తో పాటు నిర్మాత సౌందర్య రజనీకాంత్ బృందానికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.

దర్శకుడి నుంచి హీరోగా..

అభిషన్ జీవింత్ (Abhishan Jeevinth) యూట్యూబర్ గా కెరీర్ మొదలుపెట్టాడు. టూరిస్ట్ ఫ్యామిలీ మూవీతో డైరెక్టర్గా మారాడు. తొలి సినిమాకే సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ఓ పాత్ర పోషించాడు. ఇకపోతే గతేడాది అతడు ప్రేయసి అఖిల మెడలో మూడు ముళ్లు వేశాడు. ఈ పెళ్లికి హాజరైన టూరిస్ట్ ఫ్యామిలీ నిర్మాత మగేశ్ రాజ్.. అభిషన్ కు, కారు గిఫ్ట్ ఇచ్చాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.