📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Aap Jaisa Koi Movie: ‘ఆప్ జైసా కోయి’ (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ

Author Icon By Anusha
Updated: July 14, 2025 • 5:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆర్. మాధవన్ – ఫాతిమా సనా షేక్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా ‘ఆప్ జైసా కోయి’, వివేక్ సోని దర్శకత్వంలో రూపొందింది. ఈ నెల11,నుంచి (Netflix) లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ చిత్రం.హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా అందుబాటులో ఉంది.

కథా నేపథ్యం

ఈ చిత్రం కథ జంషెడ్‌పూర్ కు చెందిన సంస్కృత ఉపాధ్యాయుడు శ్రీ (R. Madhavan) చుట్టూ తిరుగుతుంది. అతను 42 ఏళ్ల వయస్సులోనూ పెళ్లికి దూరంగా ఉంటూ, తన జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతుంటాడు. కానీ అతని సోదరుడు భాను, వదిన కుసుమ, స్నేహితుడు దీపక్ అతనిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెడతారు. దీపక్ తన వంతు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే అతను ‘ఆప్ జైసా కోయి’ అనే డేటింగ్ యాప్ ను శ్రీకి పరిచయం చేస్తాడు. యాప్‌లో పరిచయమైన మధు బోస్ (Fatima Sana Shaikh) ,ఇద్దరూ కలిసి మాట్లాడుకున్న తరువాత, తమ అలవాట్లు, అభిరుచులు దగ్గరగా ఉన్నాయనే విషయాన్ని గ్రహిస్తారు. ఇద్దరూ కలిసి ప్రయాణించాలనే నిర్ణయానికి వస్తారు. మధు తల్లిదండ్రులు, ఆమె నానమ్మ అంతా కూడా ఈ సంబంధం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. అలాగే శ్రీ అన్నావదినలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు.

Aap Jaisa Koi Movie: ‘ఆప్ జైసా కోయి’ (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ

కథనం

శ్రీ – మధు నిశ్చితార్థానికి అన్నిరకాల ఏర్పాట్లు జరిగిపోతాయి. బంధుమిత్రులతో అక్కడి వాతావరణం అంతా సందడిగా మారిపోతుంది. తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని అప్పుడు మధూతో చెబుతాడు శ్రీ. అందుకు కారణం ఏమిటి? అప్పుడు మధు ఎలా ప్రతిస్పందిస్తుంది? ఆ తరువాత చోటుచేసుకునే సన్నివేశాలు (scenes) ఎలాంటివి? అనేది కథ.చాలామంది పురుషులు పెళ్లి విషయంలో అమ్మాయిలకి కొన్ని పరిమితులు పెడుతూ ఉంటారు. వాటికి ఇష్టమైతేనే తమ పెళ్లి జరుగుతుందని తేల్చి చెబుతుంటారు. ఇక మరికొంతమంది పురుషులు వివాహమైన దగ్గర నుంచి, తమ సేవ చేసుకుంటూ వెళ్లడమే భార్య కర్తవ్యంగా భావిస్తూ ఉంటారు. సమయం ప్రకారం తమకి కావాల్సినవి సమకూర్చే ఒక యంత్రంగా చూస్తూ ఉంటారు. అలాంటి ఒక స్వభావం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే ప్రధానమైన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

ఆర్. మాధవన్ పూర్తి పేరు ఏమిటి?

ఆర్. మాధవన్ పూర్తి పేరు,రంగనాథన్ మాధవన్.

మాధవన్ సినీ రంగ ప్రవేశం ఎప్పుడు జరిగింది?

1996లో టీవీ సీరియల్స్ ద్వారా, తరువాత 2000లో “అలైపాయుతే” (తమిళం) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: B Saroja Devi: సరోజా దేవి మృతిపై ప్రధాని మోదీ సంతాపం

aap jaisa koi movie review Breaking News Fatima Sana Shaikh new movie netflix november release R Madhavan netflix film romantic comedy hindi 2025 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.