📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్

Latest News: Sai Pallavi – ఆమిర్‌ఖాన్ కొడుకు,సాయిప‌ల్ల‌వి.. సినిమా టైటిల్‌ను మార్చిన మేక‌ర్స్

Author Icon By Anusha
Updated: September 13, 2025 • 7:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలీవుడ్‌లో స్టార్ హీరో ఆమిర్‌ఖాన్‌ తన కుమారుడు జునైద్ ఖాన్‌ (Junaid Khan) ని హీరోగా, ఒక ప్రత్యేకమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో జునైద్‌కు జోడీగా సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) నటిస్తోంది. మొదట ఈ సినిమాకు “ఏక్ దిన్” అనే టైటిల్‌ను మేకర్స్ ప్రకటించినప్పటికీ, తాజాగా ఆ టైటిల్ మార్చి “మెరే రహో” (Mere Raho) అనే పేరుతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు అధికారికంగా వెల్లడించారు.

ఈ సినిమాకి సునీల్ పాండే (Sunil Pandey) దర్శకత్వం వహిస్తుండగా, డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాకు సంబంధించిన వివరాలను చిత్రబృందం ఇటీవలే బయటపెట్టింది. బాలీవుడ్ (Bollywood) ప్రేక్షకుల్లోనే కాకుండా దక్షిణాదిలోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కారణం జునైద్ ఖాన్ తొలి సినిమా కావడంతో పాటు, సాయి పల్లవి హిందీ సినిమాలో నటించడం పెద్ద హైలైట్‌గా మారింది.

Sai Pallavi

భావప్రధానమైన పాత్రలు అయినా సులభంగా నెరవేర్చగలగడం

సాయి పల్లవి ఇప్పటివరకు తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో తన సహజమైన నటనతో విశేషమైన అభిమానులను సంపాదించుకుంది. ఆమె పాత్రలు సాధారణ అమ్మాయి పాత్రలు అయినా, భావప్రధానమైన పాత్రలు అయినా సులభంగా నెరవేర్చగలగడం ఆమె ప్రత్యేకత. ఈ కారణంగానే ఆమెను “నాచురల్ యాక్ట్రెస్” అని పలువురు పిలుస్తారు. ఇప్పుడు ఆమె బాలీవుడ్‌లో అడుగుపెడుతుండటంతో హిందీ ప్రేక్షకుల్లోనూ సాయి పల్లవి క్రేజ్ పెరిగింది.

ఈ సినిమాను ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan) తో పాటు బాలీవుడ్ అగ్ర నిర్మాత మన్సూర్ ఖాన్ (Mansoor Khan) నిర్మిస్తున్నాడు. ఆమిర్‌ఖాన్ – మన్సూర్ ఖాన్ దాదాపు 17 ఏండ్ల త‌ర్వాత ఈ సినిమాతో మ‌ళ్లీ క‌లుస్తున్నారు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో 2008లో వ‌చ్చిన ‘జానే తూ… యా జానే నా’ చిత్రం సూప‌ర్ హిట్‌ను అందుకుంది.

Read hindi news: epaper.vaartha.com

Read Also:

https://vaartha.com/aishwarya-lekshmi-aishwarya-says-goodbye-to-social-media/cinema/546740/

Aamir Khan Mansoor Khan production aamir-khans-son-junaid-khan-and-sai-pallavi-film-titled-mere-raho-2140885 Aamir Khan son Junaid Khan Breaking News Ek Din old title latest news Mere Raho movie Sai Pallavi Bollywood movie Sunil Pandey director Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.