బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను నిశ్శబ్దంగా కాదు, ధైర్యంగా చెప్పుకున్నారు. ‘పీకే’ సినిమా కాలంలో తలెత్తిన ‘లవ్ జిహాద్’ ఆరోపణల గురించి స్పందిస్తూ, మతాంతర వివాహాలపై సమాజం చూపే దృష్టిని ఆయన ప్రశ్నించారు. “ప్రేమ మనిషికి చెందుతుంది, మతాలకు కాదు. ఇద్దరు వ్యక్తులు పరస్పరం ఇష్టపడి పెళ్లి చేసుకుంటే, అది లవ్ జిహాద్ కాదు” అని స్పష్టంగా చెప్పారు.ఆమిర్ తన కుటుంబంలో కూడా ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయని గుర్తు చేశారు. తన కుమార్తె ఐరా, హిందూ యువకుడు నుపుర్ శిఖరేతో వివాహం చేసుకుంది. సోదరి నిఖత్, సంతోష్ హెగ్డేను, చిన్న సోదరుడు ఫర్హాన్, రాజీవ్ దత్త్‌ను పెళ్లి చేసుకున్నారు. ఇవన్నీ మానవ సంబంధాల ప్రాముఖ్యతను సూచిస్తున్నాయని తెలిపారు.
పీకేపై విమర్శలకు స్పష్టత
‘పీకే’ సినిమా ఎలాంటి మతాన్ని లక్ష్యంగా పెట్టి తీయలేదని, మతాన్ని అడ్డుగా పెట్టుకుని మోసాలు చేసే వారి ప్రవర్తనను చూపించడమే తమ ఉద్దేశమని తెలిపారు. అవగాహన కల్పించడమే తామొచ్చే సందేశమని స్పష్టం చేశారు.సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు, పహల్గామ్ దాడిపై ఖాన్ ఎందుకు మాట్లాడలేదన్న వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందిస్తూ, తాను నటించిన ‘సర్ఫరోష్’లో పాకిస్థాన్‌ను పరోక్షంగా శత్రుదేశంగా చూపించామని గుర్తు చేశారు. “ఆ సినిమాకు పాకిస్థాన్ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి” అని చెప్పారు.
దంగల్‌పై పాక్ షరతులకు ఆమిర్ ధీటైన సమాధానం
పాకిస్థాన్ (Pakistan)‘దంగల్’ సినిమా విడుదలకు కొన్ని షరతులు పెట్టింది. జాతీయ జెండా, గీతం చూపించకూడదన్న షరతులు వినగానే ఆమిర్ సినిమా విడుదలను నిలిపేశాడు. “ఆర్థిక నష్టం వచ్చినా దేశగౌరవానికి మొగ్గు పెట్టను” అని స్పష్టం చేశారు.‘దంగల్’, ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ సినిమాలు భారత్‌తో పాటు చైనాలో ఘన విజయం సాధించాయని చెప్పారు. కార్గిల్ యుద్ధం తర్వాత తాను సైనికులను కలిసేందుకు లడఖ్, లేహ్ ప్రాంతాలకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. అక్కడ బంకర్లలో రాత్రులు గడిపానని, జవాన్ల బాధలు విని గర్వించానని చెప్పారు.ఆమిర్ ఖాన్ చెప్పిన మాటలు మన దేశంలో మత సంబంధాలపై ఉన్న అపోహలను తొలగించేలా ఉన్నాయి. ప్రేమ, దేశభక్తి వంటి అంశాల్లో ఆయన చూపిన స్పష్టత, సమర్థత మనకు చక్కటి మార్గదర్శకం.
Read Also : Pakistan Minister: ఐపీఎల్ మ్యాచ్‌లో ఫ్లడ్‌లైట్లను హ్యాక్ చేశారు..పాక్ రక్షణ మంత్రి