71వ జాతీయ చలనచిత్ర అవార్డులపై వివాదం
Aadu jeevitham: 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన తర్వాత, కేరళ ప్రభుత్వం కేంద్రంపై తీవ్ర విమర్శలు చేసింది. మలయాళ చిత్రాలను పక్కన పెట్టేసి అవార్డులను ప్రకటించారంటూ కేరళ ప్రభుత్వం ఆరోపించింది. ముఖ్యంగా, ‘ఆడుజీవితం’ (Aadu jeevitham) చిత్రానికి అవార్డులు దక్కకపోవడంపై దర్శకుడు బ్లెస్సీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
‘ఆడుజీవితం’కు అవార్డులు ఎందుకు దక్కలేదు?
‘ఆడుజీవితం’ సినిమాపై జాతీయ అవార్డుల జ్యూరీ ఛైర్మన్ అశుతోష్ గోవారికర్ గతంలో ప్రశంసలు కురిపించినప్పటికీ, ఇప్పుడు ఆ చిత్రంలో సాంకేతిక లోపాలు ఉన్నాయని చెప్పడంపై బ్లెస్సీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ‘ఆడుజీవితం’లో ప్రధాన పాత్ర పోషించిన నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) పై ఉన్న కోపంతోనే ఈ చిత్రానికి అవార్డును నిరాకరించారని బ్లెస్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పృథ్వీరాజ్ సుకుమారన్‌తో రాజకీయ విభేదాలు
పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన మరో చిత్రం ‘ఎల్2: ఎంపురాన్’ (L2: Empuraan). ఈ సినిమాలో 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఈ సన్నివేశాలను తొలగించాలని సినిమా విడుదలైన తర్వాత బీజేపీ డిమాండ్ చేసింది. ఈ వివాదం కారణంగానే పృథ్వీరాజ్ నటించిన ‘ఆడుజీవితం’ను కూడా జ్యూరీ పక్కన పెట్టిందని, రాజకీయ కారణాలతోనే ఈ చిత్రానికి అవార్డులు దక్కలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
ది గోట్ లైఫ్ కథలో అసలు వ్యక్తి ఎవరు?
“ది గోట్ లైఫ్” (దీనిని “ఆడుజీవితం” అని కూడా పిలుస్తారు) సినిమా సౌదీ అరేబియాలోని మేకల పెంపకం కేంద్రంలో తీవ్ర కష్టాలను, బలవంతపు శ్రమను ఎదుర్కొన్న భారతీయ వలస కార్మికుడు నజీబ్ ముహమ్మద్ యొక్క నిజమైన కథ ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమా మరియు దాని ఆధారంగా రూపొందించబడిన నవల, అతను జీవించడానికి చేసిన పోరాటాన్ని మరియు సంవత్సరాల తరబడి వేధింపులు మరియు ఒంటరితనం తర్వాత చివరికి తప్పించుకోవడాన్ని వర్ణిస్తుంది.
మేక కథలో అసలు మనిషి ఎవరు?
ఇది 2008లో బెన్యామిన్ రాసిన మలయాళ నవల ఆడుజీవితం యొక్క అనుసరణ, ఇది సౌదీ అరేబియాలో మలయాళీ వలస కార్మికుడు నజీబ్ నిజ జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: