మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ నటిస్తోన్న కొత్త చిత్రానికి టైటిల్‌ను అనౌన్స్‌మెంట్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’ అనే క్లాస్ టైటిల్ (Aadarsha Kutumbam) ను పెట్టినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా వెంకటేశ్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది. ఈ ఫస్ట్‌లుక్‌లో వెంకిమామ ఫ్యామిలీ మ్యాన్‌ల కనిపిస్తున్నాడు. గతంలో ఈ కాంబోలో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాలు ఫ్యామిలీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Read Also: Kriti Sanon: కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం…
షూటింగ్ ఈరోజు నుంచి ప్రారంభం
అయితే ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ (Aadarsha Kutumbam) సినిమా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుంచి ప్రారంభం కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రంలో వెంకటేశ్‌కు జోడీగా శ్రీనిధి శెట్టిని తీసుకోబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: