📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Squid Game : మహిళ ప్రసవించే సన్నివేశం : ‘స్క్విడ్ గేమ్-3’పై విమర్శలు

Author Icon By Divya Vani M
Updated: June 29, 2025 • 8:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ (OTT) ప్రేక్షకుల మనసులను దోచుకున్న సిరీస్ ‘స్క్విడ్ గేమ్’(Squid Game). ప్రతి సీజన్‌కి అభిమానుల నుంచి అపారమైన స్పందన లభిస్తోంది. అయితే, తాజాగా వచ్చిన మూడో సీజన్‌లో ఒక సన్నివేశం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ సీన్ వాస్తవికత లేకుండా చూపించారంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.ఈ వివాదాస్పద సన్నివేశం సీజన్ 3లోని రెండో ఎపిసోడ్‌లో వస్తుంది. ఇందులో ‘కిమ్ జున్ హీ’ పాత్రధారి ఆకస్మికంగా ప్రసవ వేదనకు లోనవుతుంది. తోటి కంటెస్టెంట్ ‘గెమ్ జా’ సాయంతో కేవలం ఐదు నిమిషాల్లోనే ఆమె బిడ్డకు జన్మనిస్తుంది. అది కూడా ఎలాంటి వైద్య సాయం లేకుండా, నొప్పులు లేకుండా. ప్రసవానంతరం ఎటువంటి అలసట కనిపించకుండా మామూలుగానే నడుచుకుంటూ వెళ్లిపోతుంది.

నెటిజన్ల అసహనం ఎక్కడికి చేరిందంటే…

ఈ సన్నివేశం ప్రసారమైన వెంటనే విమర్శల తుపాను వచ్చేసింది. ‘‘నీళ్లు పోగానే బిడ్డ పుట్టింది, వెంటనే లేచి నడిచింది’’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ 75 లక్షల వ్యూస్‌ను దాటింది. ‘‘ఈ బిడ్డకు కూడా సిన్సియరిటీ ఎక్కువేమో, ఏడవాల్సిన టైమ్‌కి ఏడుస్తుంది’’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు మరికొందరు.

దర్శకుడిపై నిప్పులు చెరిగిన వ్యాఖ్యలు

ప్రసవం ప్రక్రియపై కనీస అవగాహన లేకుండా దర్శకుడు ఇలా చూపించారని మండిపడుతున్నారు. వైద్య నిపుణుల గైడ్‌లైన్స్ తీసుకోకుండా చిత్రీకరించడం, మూత్రపిండాలు, రక్తస్రావం, శ్రమ తతంగాలేమీ చూపించకపోవడం విమర్శలకు దారితీసింది. ‘‘ఇది సోమరి రచనకు నిదర్శనం’’ అంటూ నెటిజన్లు తిప్పి పొడుస్తున్నారు.

కొంతమంది మద్దతు… కానీ మెజారిటీ నిరసన

కొంతమంది ఈ సీన్‌ను ఓర్పు, జీవన జ్ఞానంగా చెబుతున్నా, చాలా మంది మాత్రం అంగీకరించలేకపోతున్నారు. ముఖ్యంగా, ప్రసవం తర్వాత తల్లి స్కిప్పింగ్ చేయడం మరింత చర్చకు తావిచ్చింది. ఇది ‘స్క్విడ్ గేమ్’ వాస్తవికతకు దూరంగా ఉందని విశ్లేషకుల అభిప్రాయం.‘స్క్విడ్ గేమ్’ తరచూ సామాజిక అంశాలపై గంభీరంగా స్పందిస్తుంటుంది. కానీ, ఇలాంటి సన్నివేశాల ద్వారా సిరీస్‌ మీద ప్రజల్లో విరక్తి పెరుగుతోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సీన్ వల్ల సిరీస్‌ను మానేస్తున్నట్లు పలువురు నెటిజన్లు ప్రకటించడం గమనార్హం.

Read Also : Harihara Veeramallu: జూలై 3న ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ రిలీజ్

#ControversialScene #NetflixDrama #SquidGame3 FakeChildbirthScene KimJunHee KoreanDramaCriticism OTTControversy SquidGameNetflix

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.