📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Manchu Vishnu Dubai: దుబాయ్‌లో మంచు విష్ణు ఫ్యామిలీకి తప్పిన ముప్పు

Author Icon By Aanusha
Updated: March 1, 2026 • 12:18 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి
A missed threat to Manchu Vishnu’s family in Dubai

Manchu Vishnu Dubai: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల ప్రభావం ఇప్పుడు దుబాయ్‌పై కూడా పడింది. ఇరాన్ ప్రయోగించిన మిస్సైళ్లు దుబాయ్ నగరాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి సెలవుల్లో ఉన్న టాలీవుడ్ నటుడు మంచు విష్ణు ఈ దాడుల మధ్య చిక్కుకుపోయారు. తాము ఉంటున్న ఇంటికి అత్యంత సమీపంలో మిస్సైళ్లు పేలడంతో ఇల్లు ఒక్కసారిగా కంపించిందని, తీవ్ర భయాందోళనకు గురయ్యామని ఆయన వెల్లడించారు.

Read Also: Geeturoyal Tirumala Reels Controversy: తిరుమల ఘాట్ రోడ్డులో గీతూ రాయల్ రీల్స్ కలకలం

సోషల్ మీడియాలో భయానక వీడియో

ముఖ్యంగా క్షిపణులను అడ్డుకుంటున్న సమయంలో వచ్చిన భారీ శబ్దాలకు తాము బస చేసిన ఇల్లు దద్దరిల్లిపోయిందని విష్ణు పేర్కొన్నారు. ఈ శబ్దాలకు తన చిన్న కూతురు ఐరా తీవ్రంగా భయపడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏ చిన్నారి కూడా ఇలాంటి యుద్ధ వాతావరణంలో, బాంబుల శబ్దాల మధ్య పెరగకూడదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పిల్లలకు ప్రశాంతమైన వాతావరణం ఉండాలని ఆకాంక్షించారు.

అయితే, పౌరుల రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న యూఏఈ రక్షణ దళాలకు మంచు విష్ణు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి వల్లే తాము క్షేమంగా ఉన్నామని చెప్పారు. జీవితం ఎంత చిన్నదో, ఎంత సున్నితమైనదో ఇలాంటి ఘటనలు గుర్తుచేస్తాయని ఎమోషనల్ అయ్యారు. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ, శాంతి నెలకొనాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. చివరగా ‘హర హర మహాదేవ్’ అంటూ తన సందేశాన్ని ముగించారు. ప్రస్తుతం మంచు విష్ణు చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Iran Missile Attack Dubai Manchu Vishnu Dubai Manchu Vishnu Family Safety Manchu Vishnu Twitter Video

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.