70th Filmfare Awards: ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, నటిగా నివేతా థామస్

Read Time:  1 min
70th Filmfare Awards
70th Filmfare Awards
FONT SIZE
GET APP

70th Filmfare Awards: 70వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ప్రదానోత్సవం కేరళలోని కొచ్చి వేదికగా వైభవంగా జరిగింది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. ‘పుష్ప 2: ది రూల్’ చిత్రానికి గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడు (తెలుగు) అవార్డును అందుకున్నారు. ఇది ఆయన కెరీర్‌లో ఏడవ ఫిల్మ్ ఫేర్ అవార్డు కావడం విశేషం. దీంతో మెగాస్టార్ చిరంజీవి పేరిట ఉన్న దీర్ఘకాల రికార్డును అల్లు అర్జున్ సమం చేశారు. 35: చిన్న కథ కాదు’ చిత్రానికి నివేతా థామస్ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకుంది. ఈసారి ‘పుష్ప 2’ ఎక్కువ అవార్డులను దక్కించుకొని ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

Read Also:Vishwak Sen: మ్యూజిక్ డైరెక్టర్‌కు రోలెక్స్ ఇచ్చిన విశ్వక్

70th Filmfare Awards
70th Filmfare Awards: Allu Arjun wins Best Actor, Nivetha Thomas wins Best Actress

ముఖ్య అవార్డులు (తెలుగు విభాగం)

  • ఉత్తమ చిత్రం: పుష్ప 2
  • ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప 2)
  • ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్: పుష్ప 2
  • ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 AD)
  • ఉత్తమ సహాయ నటి: అంజలి (గ్యాంగ్ ఆఫ్ గోదావరి)
  • ఉత్తమ పరిచయ దర్శకుడు: యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)
  • ఉత్తమ పరిచయ నటి: నయన్ సారిక (గం గం గణేశా)
  • ఉత్తమ సాహిత్యం: “చుట్టమల్లే చుట్టేస్తోంది” (దేవర)
  • ఉత్తమ గాయకుడు: శ్రీకృష్ణ (కుర్చీ మడతపెట్టె – గుంటూరు కారం)
  • ఉత్తమ గాయని: శిల్పా రావు (చుట్టమల్లే చుట్టేస్తోంది)
  • ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: నితిన్ జిహానీ (కల్కి 2898 AD), రామకృష్ణ & మోనిక (పుష్ప 2)
  • ఉత్తమ కొరియోగ్రాఫర్: శేఖర్ మాస్టర్ (కుర్చీ మడతపెట్టె)

క్రిటిక్స్ అవార్డులు

  • ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): లక్కీ భాస్కర్
  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్): తేజ సజ్జా
  • ఉత్తమ నటి (క్రిటిక్స్): కాజల్ అగర్వాల్ (సత్యభామ)

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.