తెలుగు డిజిటల్ వినోద రంగంలో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ (Aha) మరోసారి ప్రేక్షకుల ముందుకు ఆసక్తికరమైన కంటెంట్‌తో ముందుకొచ్చింది.. గతంలో మంచి విజయాన్ని అందుకున్న ‘3 రోజెస్’ వెబ్ (3 Roses S2) సిరీస్ ఇప్పుడు రెండవ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సీజన్ 2 ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
Read also: రజనీకాంత్ బర్త్‌డే.. ఆనాటి జ్ఞాపకాలను షేర్ చేసుకున్న దర్శకుడు
కొత్త రోజెస్, కొత్త ఎంటర్‌టైన్‌మెంట్
మొదటి సీజన్‌లో ఇషా రెబ్బా, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటించగా.. ఈ సీజన్ 2లో ఇషా రెబ్బాతో పాటు రాశీ సింగ్, కుషిత కల్లపు కొత్త ‘రోజెస్’ (3 Roses S2) గా కనిపించనున్నారు. కమెడియన్ వైవా హర్షతో పాటు సత్య కూడా నవ్వులు పూయించడానికి రెడీగా ఉన్నారు. ఎస్.కె.ఎన్ నిర్మాణంలో, కిరణ్ కారవల్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ డిసెంబర్ 13 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ ట్రైలర్‌ను మీరు కూడా చూసేయండి. ఈ వెబ్ సిరీస్‌కు కిరణ్ కె కరవళ్ళ దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్కేఎన్ (SKN) నిర్మిస్తున్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: