సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్‘ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.ఆకట్టుకునే కథ, అద్భుతమైన నేపథ్య సంగీతం, స్టార్ హీరోల అతిధి పాత్రలు ఈ సినిమాకు భారీ వసూళ్లు తెచ్చిపెట్టాయి.వరుస పరాజయాలతో సతమతమవుతున్న రజనీకాంత్‌కు ‘జైలర్’ సినిమా విశేష విజయాన్ని అందించింది. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్—’జైలర్ 2’తెరకెక్కుతోంది.నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్’ సినిమా కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఘన విజయం సాధించింది.
ఇందులో రజనీకాంత్‌కు జోడీగా రమ్యకృష్ణ నటించగా, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్స్‌లో మెరిశారు స్క్రీన్‌ప్లే, కలెక్షన్ల పరంగా ‘జైలర్’ జనాల ఆదరణ పొందింది. ఇప్పుడు అదే జోష్‌తో ‘జైలర్ 2’ సినిమాను తెరకెక్కిస్తున్నారు.సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ‘జైలర్ 2’ టీజర్ విడుదల చేశారు.
ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. టీజర్‌లో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, దర్శకుడు నెల్సన్ కనిపించడం ప్రత్యేక ఆకర్షణ.అనిరుధ్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ టీజర్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టీజర్‌ను చూస్తే ఈ సారి మరింత యాక్షన్, వైలెన్స్ ఎక్కువగా ఉండబోతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.’జైలర్ 1’లో నటించిన రమ్యకృష్ణ, వినాయకన్, తమన్నా భాటియా, వసంత్ రవి, మీర్నా మీనన్, యోగి బాబు తదితరులు ‘జైలర్ 2‘లోనూ కనిపించనున్నారు. ఈ సినిమా మరింత ఆకట్టుకునేలా యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది. ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ‘జైలర్ 2’ ఎంతటి విజయం సాధిస్తుందో చూడాలి.