📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్

సినీ ఇండస్ట్రీలో విషాదం.

Author Icon By Divya Vani M
Updated: December 24, 2024 • 8:15 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతీయ చలనచిత్ర రంగానికి అమూల్యమైన సేవలు అందించిన లెజెండరీ దర్శకుడు,స్క్రీన్‌ప్లే రచయిత శ్యామ్ బెనగల్ (90) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 23న ముంబైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో సినీ ప్రపంచం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. శ్యామ్ బెనగల్ మృతిపై సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.ఆయన మరణం భారతీయ సినీ రంగానికి తీరని లోటుగా అభివర్ణిస్తున్నారు.జనసేన అధినేత,నటుడు పవన్ కళ్యాణ్ ఆయనకు ఘన నివాళి అర్పించారు. తన సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు:అమూల్ పాల రైతుల నుంచి ఒక్కొక్కరితో రెండు రూపాయలు తీసుకొని నిధులు సమకూర్చి ‘మంథన్’ను తీశారు.అటువంటి నిబద్ధత కలిగిన దర్శకులు అరుదుగా ఉంటారు” అని పవన్ పేర్కొన్నారు.శ్యామ్ బెనగల్ అనకూడా సత్యజిత్ రే తర్వాత భారతీయ ఆర్ట్ ఫిల్మ్స్‌లో ప్రాధాన్యం సొంతం చేసుకున్న దర్శకుల్లో అగ్రగణ్యుడు.

ఆయన దర్శకత్వంలో వచ్చిన అంకుర్, నిశాంత్, భూమిక, మండి,మంథన్ వంటి చిత్రాలు సమాజంలోని వాస్తవికతను ప్రతిబింబిస్తూ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచాయి. శ్యామ్ బెనగల్ ప్రతిభకు భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలతో గౌరవించింది. అలాగే, ఏడు సార్లు నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఘనత ఆయనది.శ్యామ్ బెనగల్ మరణం భారతీయ చిత్రసీమకు తీరని లోటు అని సినీ,రాజకీయ ప్రముఖులు పేర్కొంటున్నారు.ఆయన మరణ వార్త తెలుసుకున్న అనేక మంది సోషల్ మీడియాలో ఆయనకు నివాళి అర్పిస్తున్నారు.సమాజంలో ఉన్న వాస్తవ పరిస్థితులను అద్భుతంగా తెరపై ఆవిష్కరించే శక్తి శ్యామ్ బెనగల్ గారిదే. ఆయన చిత్రాలు, వ్యక్తిత్వం భారతీయ చలనచిత్ర రంగంలో మార్గదర్శకంగా నిలిచాయి.ఆయన శైలి, ఆలోచనలు తరతరాలకు ప్రేరణగా ఉంటాయి.ఆయన మరణం సినీప్రపంచం లోనే కాదు,దేశవ్యాప్తంగా ఒక అపార లోటుగా మారింది. ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి. శ్యామ్ బెనగల్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన.

Indian Art Films Legendary Director Manthan Movie Renowned Filmmaker Shyam Benegal Shyam Benegal Passes Away

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.