ధనుష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా తెలుగు సినిమా కుబేర పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఫస్ట్‌లుక్, టీజర్‌లతో ఇప్పటికే సినిమాపై ఆసక్తి పెరిగింది. రష్మిక మందన్న ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ నటుడు నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. డేవి శ్రీ ప్రసాద్ (డీఎస్పీ) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.తమిళ సూపర్‌స్టార్ ధనుష్, శేఖర్ కమ్ముల వంటి సెన్సిబుల్ డైరెక్టర్ కలిసి పనిచేయడం ఈ ప్రాజెక్ట్‌ను ప్రత్యేకంగా నిలిపింది.ధనుష్ ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు తన నటనతో దగ్గరయ్యాడు.
హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తూ,అనేక భాషల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న ధనుష్ ఈ చిత్రంలో పూర్తిగా కొత్త లుక్ లో కనిపించనున్నారు. రష్మిక ఈ సినిమాతో మరో మైలురాయి అందుకోనుంది.ఆమె పాత్ర సినిమాకు కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ఇక కింగ్ నాగార్జున పాత్ర చిత్రానికి మజాను పెంచుతుందని చెప్పొచ్చు.ఆయన పాత్ర గురించి ఇప్పటివరకు పెద్దగా వివరాలు లేవు, కానీ ఇందులో ఆయన ప్రభావం ప్రధానమని చిత్ర యూనిట్ హింట్ ఇచ్చింది.డేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. అతడి కంపోజ్ చేసిన పాటలో ధనుష్ తొలిసారిగా తెలుగు సినిమాలో పాడడం విశేషం.
ధనుష్ ఇప్పటికే తమిళ సినిమాల్లో పలు సూపర్ హిట్ పాటలు పాడగా, ఇప్పుడు ఈ సినిమాలో కూడా తన గాత్రంతో ప్రేక్షకులను అలరించనున్నాడు. కుబేర చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది.థాయ్‌లాండ్, తిరుపతి, ముంబై, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ప్రధానంగా చిత్రీకరణ జరిగింది. ఇప్పటికే 80% షూటింగ్ పూర్తయిందని సమాచారం. త్వరలోనే సినిమా చిత్రీకరణ ముగిసే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత ధనుష్ తన సొంత దర్శకత్వంలో ఇట్లీ కాడ్ అనే సినిమాను తెరకెక్కించనున్నారు. అలాగే, రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందనున్న డీ55 అనే చిత్రానికి కూడా కమిట్ అయ్యారు.