हिन्दी | Epaper
వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే!

మోహన్ బాబు ఎమోషనల్ పోస్ట్..

Divya Vani M
మోహన్ బాబు ఎమోషనల్ పోస్ట్..

టాలీవుడ్‌లో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుటుంబంలో నెలకొన్న పరిస్థితులు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఇటీవల ఆయన కుమారుడు మంచు మనోజ్ ఆసుపత్రిలో చేరడాన్ని చుట్టూ వివిధ రకాల కథనాలు ప్రచారం అవుతున్నాయి. మంచు ఫ్యామిలీ మధ్య విభేదాలు మరోసారి పెరిగాయని, ఈసారి ఆస్తుల పంపకాలు కారణంగా మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య తీవ్ర వివాదం జరిగినట్లు పుకార్లు వినిపించాయి.ఆ విషయంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేశారని, ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారని ఆదివారం ఉదయం నుంచే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఈ సమాచారం నిజమా కాదా అనే సందేహం ఉన్నప్పటికీ, మోహన్ బాబు పీఆర్ టీమ్ ఈ పుకార్లను ఖండించింది.

అటువంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని, నిరాధారమైన వార్తలు ప్రచారం చేయవద్దని పేర్కొంది.అయితే, ఇదే సమయంలో మంచు మనోజ్ నడవలేని స్థితిలో ఆసుపత్రిలో చేరడాన్ని చూపించే వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడం ఆందోళనను మరింత పెంచింది. ఈ పరిణామాలతో మంచు ఫ్యామిలీలో అసలు ఏమి జరుగుతుందో ఎవరికీ స్పష్టత రావడం లేదు.

ఇదిలా ఉండగానే మోహన్ బాబు ఓ భావోద్వేగపూరిత ట్వీట్‌ చేశారు, కానీ అది కుటుంబ సమస్యల గురించి కాదు. తన సినిమా కెరీర్‌ను గుర్తుచేసుకుంటూ చేసిన ఈ ట్వీట్‌ ప్రస్తుతం విపరీతంగా దృష్టి ఆకర్షిస్తోంది. 1979లో విడుదలైన ‘కోరికలే గుర్రాలైతే’ చిత్రంలోని తన అనుభవాలను మోహన్ బాబు తలుచుకున్నారు. యమధర్మరాజు పాత్రలో చేసిన తన నటనను జ్ఞాపకం చేసుకుంటూ, తన జీవితంలో ఆ పాత్ర ఎంతటి ప్రత్యేకతను కలిగించిందో తెలిపారు.

తన ట్వీట్‌లో, “నాకు ప్రియమైన గురువు శ్రీ దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో, ప్రొడ్యూసర్ శ్రీ జి. జగదీశ్ చంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో వచ్చిన ఈ సినిమా నా కెరీర్‌లో గొప్ప మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో చంద్రమోహన్ గారు, మురళీ మోహన్ గారితో కలిసి పనిచేయడం నా అదృష్టం. తొలిసారిగా యమధర్మరాజు పాత్రను పోషించడం నాకు ఎంతో సవాలుతో కూడుకున్నదే కాకుండా, అంతే సంతోషాన్ని ఇచ్చింది,” అంటూ చెప్పుకొచ్చారు.

ఇప్పటి కుటుంబ వివాదాలపై వస్తున్న కథనాల మధ్య మోహన్ బాబు ఈ ట్వీట్ చేయడం, వీటికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేయడం మరింత ఆసక్తిని రేపింది. ఇది కుటుంబ గొడవల నుంచి దృష్టిని మరల్చేందుకు చేసిన ప్రయత్నమా లేక నిజంగానే తన సినీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకునే సందర్భమా అనేది ఆసక్తికర చర్చకు దారి తీసింది. నేటి పరిస్థితుల్లో మంచు ఫ్యామిలీలో నడుస్తున్న అసలైన వ్యవహారాలు ఎలా ఉంటాయో, సమయం చెప్పాల్సి ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870