हिन्दी | Epaper
ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’

మీనాక్షి చౌదరి తో సుశాంత్ ఎంగేజ్మెంట్ నిజమేనా?

Divya Vani M
మీనాక్షి చౌదరి తో సుశాంత్  ఎంగేజ్మెంట్ నిజమేనా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఫుల్ బిజీ హీరోయిన్‌గా వెలుగొందుతున్న మీనాక్షి చౌదరి, లక్కీ భాస్కర్ సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్‌తో చేసిన ‘మట్కా’ విడుదలకు సిద్ధంగా ఉంది, అలాగే విశ్వక్ సేన్ నటించిన ‘మెకానిక్ రాకీ’ లో కూడా ఈమె ప్రధాన హీరోయిన్‌గా కనిపించనుంది. ఇక మరోవైపు, వెంకటేష్‌తో కలిసి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే మరో సినిమా కూడా చేస్తోంది, ఇది 2025 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఇవన్నీ చూస్తుంటే, మీనాక్షి ఇప్పట్లో తన కెరీర్‌లో గ్యాప్ తీసుకోకుండా ఫుల్ స్వింగ్లో ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇంత బిజీ షెడ్యూల్ మధ్య, పెళ్లి విషయాలు చర్చకు రావడం ఆసక్తికరంగా ఉంది. కొద్దిరోజులుగా మీనాక్షి చౌదరి గురించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే, తన తొలి సినిమా హీరో సుశాంత్‌ను త్వరలో పెళ్లి చేసుకోబోతుందని, త్వరలోనే వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తుండగా, మీనాక్షి ఫ్యాన్స్ ఈ వార్త నిజమా కాదా అనేదానిపై కొంచెం అయోమయంగా ఉన్నారు.

ఈ వార్తలపై మీనాక్షి టీం స్పందిస్తూ, ఇలాంటి ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టత ఇచ్చింది. మీనాక్షి, సుశాంత్ ఇద్దరూ మంచి స్నేహితులే గానీ, వారి మధ్య పెళ్లి సంబంధాలు లేవని తేల్చి చెప్పారు. నిజానికి, సుశాంత్ హీరోగా నటించిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతోనే మీనాక్షి సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ కాబట్టి ఈ వార్తలపై ఇంత స్పష్టత ఉన్నప్పటికీ, అధికారిక ప్రకటన కూడా వస్తే ఈ రూమర్స్ పూర్తిగా చక్కబడతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870